Moviesఆ స్టార్ డైరెక్టర్ చేసిన పనికి నంబర్ బ్లాక్ చేసిన రష్మిక......

ఆ స్టార్ డైరెక్టర్ చేసిన పనికి నంబర్ బ్లాక్ చేసిన రష్మిక… డైరెక్టర్ ఏం చేశాడంటే…?

ప్ర‌స్తుతం సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న ముద్దుగుమ్మ‌ల్లో ర‌ష్మిక మంద‌న కూడా ఒక‌రు. ర‌ష్మిక కేవ‌లం సౌత్ లోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో కూడా త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అమితాబ‌చ్చ‌న్ తో క‌లిసి ఓ సినిమాలో నటిస్తుంది. నిజానికి ర‌ష్మిక మొద‌ట క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కిరిక్ పార్టీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

ఆ త‌ర‌వాత ర‌ష్మిక వ‌రుస ఆఫ‌ర్ లు అందుకుంది. అంతే కాకుండా ఛ‌లో సినిమాతో తెలుగులో అడుగుపెట్టి మొద‌టి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ర‌ష్మిక‌. అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా న‌టించ‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో సూప‌ర్ హిట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే రష్మిక ఓ డైరెక్ట‌ర్ ను బ్లాక్ చేశాన‌ని ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. అస‌లు ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు ఎందుకు బ్లాక్ చేసింది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం…త‌న‌కు ఓ రోజు కాల్ వ‌చ్చింద‌ని చెప్పింది. మిమ్మ‌ల్సి మా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని అనుకుంటున్నాం మీతో మాట్లాడాల‌ని అన్నార‌ని చెప్పింది. అంతే కాకుండా ఎవ‌రో ఆట‌ప‌ట్టిస్తున్నార‌ని అనుకుని త‌న‌కు ఇంట్రెస్ట్ లేద‌ని చెప్పార‌ట‌. అంతే కాకుండా ఆ ఫోన్ నంబ‌ర్ ను సైతం ర‌ష్మిక బ్లాక్ లో పెట్టేసింద‌ట‌.

అయితే ఆ త‌ర‌వాత త‌న స్కూల్ టీచ‌ర్ ద్వారా ఆ డైరెక్ట‌ర్ ర‌ష్మిక‌ను సంప్ర‌దించార‌ట‌. అంతే కాకుండా సినిమాలోనూ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు..ర‌ష్మిక‌ను సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేసిన రిష‌బ్ శెట్టి. అంతేకాకుండా ఆ సినిమా క‌న్న‌డ నాట సూప‌ర్ హిట్ గా నిలిచిన‌ కిరిక్ పార్టీ. ఇక ప్ర‌స్తుతం మాత్రం రిష‌బ్ శెట్టి ర‌ష్మిక మంద‌న మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news