Moviesవామ్మో..ప్రభాస్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు.. అంకుల్ అయిపోయాడే.. 'రాజా డీలక్స్'...

వామ్మో..ప్రభాస్ ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు.. అంకుల్ అయిపోయాడే.. ‘రాజా డీలక్స్’ మూవీ పిక్ లీక్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా పిక్స్ ఏ రేంజ్ లో లీక్ అయిపోయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే . కాగా ఇప్పటికే స్టాల్ హీరోల సినిమాలకు సంబంధించిన క్రేజీ క్రేజీ పిక్స్ అప్డేట్స్ లీక్ అయ్యి అభిమానులకు కొత్త బూస్టప్ ఇస్తుండగా.. రీసెంట్గా టాలీవుడ్ రెబల్ హీరో పాన్ ఇండియా వైడ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి సంబంధించిన తాజా సినిమా పిక్స్ రిలీజ్ అయి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా డీలక్స్ . ఇప్పటివరకు ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన ఇవ్వని ప్రభాస్ .. బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాడు. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసి..రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ పిక్ సోషల్ మీడియాలో లీకై ప్రభాస్ లుక్స్ పై హ్యుజ్ ట్రోలింగ్ అయ్యేలా చేస్తుంది.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో రాజా డీలక్స్ లోనిదే. ఈ ఫోటోలో ప్రభాస్ చాలా ముసలి లుక్స్ లో కనిపిస్తున్నారు. గుబురు గడ్డంతో ఫేస్ లో డల్ నెస్.. ఏదో పాటకి సంబంధించిన పిక్ గా తెలుస్తుంది ఆ. యనతో ఉన్న హీరోయిన్ రిద్ది కుమార్ కనిపిస్తుంది. ఈమె ఓ బాలీవుడ్ బ్యూటీ . ఆల్రెడీ రాధే శ్యామ్.. సినిమాలో నటించింది. వీళ్లిద్దరి ఫోటో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ లుక్స్ ఆధారంగా ప్రభాస్ ఈ సినిమాలో కూడా ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనిపిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . మరి కొంత మంది ప్రభాస్ ని అంకుల్ అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉండడం రెబల్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news