Moviesముచ్చటగా మూడోసారి..ఆ స్టార్ హీరోతో NTR మల్టీ స్టారర్ మూవీ ఫిక్స్...

ముచ్చటగా మూడోసారి..ఆ స్టార్ హీరోతో NTR మల్టీ స్టారర్ మూవీ ఫిక్స్ అయిపోయిందోచ్..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా డైరెక్టర్ వెట్రిమారన్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఈ డైరెక్టర్ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేక పోయేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలుసు. దానికి మెయిన్ రీజన్ ఆయన తెరకెక్కించే సినిమాలలో సామాజిక కోణాలను లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ..నిజాలను బయటపెడతాడు ..అద్భుతంగా తెరకెక్కిస్తాడు. స్క్రీన్ స్పేస్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది .

అందుకే ఆయన అంటే కోలీవుడ్ జనాలకు విపరీతమైన ఇష్టం . అంతేనా ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడు వెట్రీమారన్ తో సినిమా అవకాశము వస్తే ఏ హీరో వదులుకుంటారు . మన తెలుగు స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయాలని ఆతృతగా ఉంటారు . అయితే అలాంటి వెట్రిమోరర్ టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమా చేయాలని గత రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడట. ఇదే విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.

రీసెంట్గా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో ప్రాజెక్టుపై ఓపెన్ అప్పయ్యాడు. ” అసురన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని కలిశాను . ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది ..స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. కథ నచ్చింది ..కానీ టైం సెట్ కాలేదు . త్వరలోనే ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం వెట్రీమాతన్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో మరో హీరో కూడా ఉండబోతున్నాడని ..ఆ హీరో అల్లు అర్జున్ గా చెబుతున్నారు.

అల్లు అర్జున్ – తారక్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ బాగా తెలిసిందే . రీసెంట్గా బావ బావ అంటూ పిలుచుకుంటూ సోషల్ మీడియాని షేక్ చేశారు . ఈ క్రమంలోనే ఇద్దరు జత కడితే చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఇప్పటివరకు ఎన్టీఆర్ రెండు మల్టీ స్టారర్ సినిమాలకి ఫిక్స్ అయినట్లు అవుతుంది . మొదటగా ఆర్ఆర్ఆర్ తో చరణ్ ..ఆ తర్వాత వార్ 2 లో హృతిక్ రోషన్ .. ఇప్పుడు వెట్రిమోరన్ సినిమాతో అల్లు అర్జున్ ..ఇది వరుసగా ముగ్గురు బడాహీరోలతో స్క్రీన్ చేసుకొని సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు తారక్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news