Movies"అయితే ముద్దులు.. లేదంటే కొరుకుడు.. "..అఖిల్ ఏంజెట్ పై దారుణమైన బూతులు..చెవులు...

“అయితే ముద్దులు.. లేదంటే కొరుకుడు.. “..అఖిల్ ఏంజెట్ పై దారుణమైన బూతులు..చెవులు మూసుకోవాల్సిందేనా..?

తాను ఒకటి తెలిస్తే .. దైవం మరొకటి తలచిందా అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . కాగా మొదటి షో తోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ టాక్ నమోదు చేసుకోవడం అక్కినేని ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు. కాగా ఈ సినిమాతో కచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరోల జాబితాలో జాయిన్ అవ్వాలని చూసిన అక్కినేని అఖిల్ కి నిరాశ మిగిలింది.

అంతేకాదు ఇప్పటివరకు వందకోట్ల క్లబ్ అందుకోలేని అక్కినేని హీరోలు.. ఈ సినిమాతో ఆయన ఆశను తీరుస్తారు అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేశారు . కానీ చివరికి శూన్యంగానే మిగిలింది. 100 కోట్ల క్లబ్ కాదు కదా కనీసం పెట్టిన డబ్బులు వస్తాయా ..? రావా..? అని కూడా నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు . అంతలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ నమోదు చేసుకునింది. మరీ ముఖ్యంగా కధ బాగున్నప్పటికీ ఈ కథ అఖిల్ కి సూట్ అవ్వలేదన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి .

అంతేకాదు భారీ యాక్షన్ సీన్స్ కి అఖిల్ బాడీ ఎలా సెట్ అవుతుంది. ఏం చూసి అఖిల్ ని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకున్నావు అంటూ సినిమా చూసిన జనాలు సురేందర్ రెడ్డిని నిలదీస్తున్నారు. అంతేకాదు సినిమాలో యాక్షన్ సీన్స్ కొంతవరకే ఉన్నాయి ..మిగతా దగ్గర అంతా రొమాంటిక్ సీన్స్ ఎందుకు పెట్టావ్ అంటూ మండిపడుతున్నారు. అంతేనా ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ఉంటుందని ..అయితే ముద్దులు లేదంటే కొరకడమే ఉంటుందని.. ఎక్కడా కూడా కథకి సంబంధించిన మంచి కథలు రావడం లేదు అంటూ జనాలు మండిపడుతున్నారు .

అంతే కాదు జనాలకు ఉపయోగపడే మెసేజ్ ఓరియెంటెడ్ ఫీలిం లు తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అఖిల్ ఏజెంట్ పై కొందరు ఇచ్చే రివ్యూస్ చూస్తే కచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ కి నిద్ర పట్టదు . అలాంటి దారుణమైన కామెంట్స్ ను అఖిల్ ఏజెంట్ మూవీ పై చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news