Moviesఆ హీరోయిన్‌తో ఏఎన్నార్ ఎఫైర్‌పై అన్న‌పూర్ణ‌మ్మ‌కు కంప్లైంట్ చేసిన హీరోయిన్‌.. దిమ్మ‌తిరిగే...

ఆ హీరోయిన్‌తో ఏఎన్నార్ ఎఫైర్‌పై అన్న‌పూర్ణ‌మ్మ‌కు కంప్లైంట్ చేసిన హీరోయిన్‌.. దిమ్మ‌తిరిగే రిప్లై..!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు కాస్త సన్నిహితంగా ఉంటే చాలు వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని… వారిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు మామూలే. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. మీడియా ప్రభావం ఎక్కువ. చీమచిటుక్కు మ‌న్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే కొన్ని దశాబ్దాల క్రితం కూడా టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలాంటి స్టార్ హీరోలు కూడా ఈ పుకార్లు ఎదుర్కొన్నారు. అయితే ఈ పుకార్లలో కొన్ని నిజాలు కూడా లేకపోలేదు.

దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఏ విషయంలో అయినా ఎక్కువగా క్రమశిక్షణతో ఉండేవారు. ఆయన సినిమాల్లో నటిస్తున్నప్పుడు తన పని తాను మాత్రమే చేసుకునేవారు. ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకునేవారు కాదు. సినిమా రంగం అనేది ఒక రంగుల ప్రపంచం.. ఒక మాయా ప్రపంచం అన్నది బాగా తెలుసు. అందుకే హీరోయిన్లతో కూడా ఆయన ఎక్కువగా అంటీ ముట్టనట్టుగా ఉండేవారని అంటారు.

అయితే మహానటి సావిత్రితో ఏఎన్నార్ ఎక్కువగా సినిమాలు చేశారు. అసలు మూడు సంవత్సరాల పాటు సావిత్రి డేట్ల‌ను బ్లాక్ చేయించి తన సినిమాలలో వరుసగా హీరోయిన్గా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే షూటింగ్ అయిపోయాక ఏఎన్ఆర్ – సావిత్రి కలిసి మద్రాస్ మెరీనా బీచ్ లో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారట. అయితే ఏఎన్ఆర్ ను ప్రేమించి విఫ‌ల‌మైన మరో సీనియర్ హీరోయిన్ ఎస్.వరలక్ష్మి ఏఎన్ఆర్ భార్య అన్నపూర్ణమ్మ‌కు సావిత్రి – ఏఎన్ఆర్ మధ్య ఏదో నడుస్తుందని లేనిపోని పుకార్లు ఎక్కేసి మరి చెప్పిందట.

అయితే తన భర్తపై సంపూర్ణమైన నమ్మకంతో ఉండే అన్నపూర్ణమ్మ.. రోజంతా వాళ్ళిద్దరూ షూటింగ్లో ఎంతో కష్టపడుతున్నారు.. సాయంత్రం సరదాగా బీచ్ లో కబుర్లు చెప్పుకొని ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకోవటంలో తప్పేముంది అని వరలక్ష్మికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిందట. ఈ విషయం అప్పట్లో టాలీవుడ్ వర్గాలలో పెద్ద హాట్‌ టాపిక్ గా మారింది. అన్నపూర్ణమ్మ ఇచ్చిన షాక్ తో ఎస్‌.వరలక్ష్మి మరోసారి ఇలాంటి చాడీలు చెప్పే ప్రయత్నం చేయలేదట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news