Moviesకాళీమాత భ‌క్తుడిగా బాల‌య్య‌… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ వ‌చ్చేసిందిగా…!

కాళీమాత భ‌క్తుడిగా బాల‌య్య‌… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ వ‌చ్చేసిందిగా…!

నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు బాలయ్య వరుస సూపర్ డూపర్ హిట్లతో ఫామ్ లో ఉన్నారు. అటు అనిల్ రావుపూడి ఆరు వరుస విజయాలతో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ డైరెక్టర్ల జాబితాలో ఉన్నారు. వీరిద్దరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ కు తోడు కాజల్ అగర్వాల్, శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్లు.. అటు శరత్ కుమార్ లాంటి స్టార్ నటుడు తోడవడంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్లో మామూలు అంచనాలు లేవు.

తెలంగాణ నేపథ్యంలో భారీ యాక్ష‌న్‌ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే దసరా కనుక సినిమా రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి ఆయుధపూజ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్లలో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో బాలయ్య కాళీమాత భక్తుడుగా కనిపించబోతున్నారు. అలాగే కాళీమాత దేవాలయంలో వచ్చే సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తోంది.

ఈ సినిమా క‌త అంతా తెలంగాణ ప్రాంతంలో జరుగుతుందని.. బాలయ్య తెలంగాణ మాండ‌లికంలో డైలాగులు చెబుతారని అంటున్నారు. బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉన్నా.. ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ తో పాటు డైలాగులు వెరీ ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే సినిమాలో తండ్రీ కూతుళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ కూడా హైలెట్ అవుతుందట‌.

ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని కూడా సినిమా యూనిట్ నుంచి లీకులు వస్తున్నాయి. అలాగే ప్లాష్‌ బ్యాగ్ సినిమాకు చాలా హైలెట్గా నిలుస్తోందని.. ఇదంతా చాలా వైల్డ్ గా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ అనగానే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తుండగా.. సీ రాంప్రసాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news