MoviesVeerasimha Reddy బాల‌య్య ' వీర‌సింహారెడ్డి ' 50 రోజుల సెంట‌ర్లు...

Veerasimha Reddy బాల‌య్య ‘ వీర‌సింహారెడ్డి ‘ 50 రోజుల సెంట‌ర్లు ఇవే… న‌ట‌సింహం అర‌చ‌కానికి ఇదే సాక్ష్యం…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఈ సంక్రాంతికి వ‌చ్చిన సినిమా వీర‌సింహారెడ్డి. అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమాతో వ‌రుస‌గా రెండో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్‌, హానీరోజ్ న‌టించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాతో పోటీ ప‌డి మ‌రీ బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు.

బాల‌య్య కెరీర్‌లోనే ఎప్పుడూ లేన‌ట్టుగా ప‌స్ట్ డే ఏకంగా రు. 54 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అఖండ లాంటి మాసీవ్ హిట్ త‌ర్వాత బాల‌య్య ఖాతాలో వ‌రుస‌గా రెండో హిట్ ప‌డింది. చాలా రోజుల త‌ర్వాత బాల‌య్య‌కు వరుస‌గా రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్లు ప‌డ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా 50 రోజుల పండ‌గ పూర్తి చేసుకుంది. ఇప్పుడున్న టైంలో అస‌లు మూడు, నాలుగు వారాల పోస్ట‌ర్లు చూడ‌డ‌మే గ‌గ‌నంగా ఉంది.

అలాంటి టైంలో అఖండ మానియా కంటిన్యూ చేస్తూ వీర‌సింహారెడ్డి మళ్లీ 50 రోజుల పండ‌గ పూర్తి చేసుకుంది. ఓ వైపు ఓటీటీలో దూసుకుపోతూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నా.. ఇటు థియేట్రిక‌ల్‌గా కూడా 50 రోజుల ర‌న్ పూర్తి చేసుకుంది. ఓవ‌రాల్‌గా షిప్టుల‌తో క‌లుపుకుని మొత్తం 53 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు ఆడింది. ఇది బాల‌య్య మాస్ న‌ట విశ్వ‌రూపానికి సాక్ష్యం. అఖండ అయితే షిఫ్టుల‌తో క‌లుపుకుని 100కు పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అలాగే అఖండ 4 కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు ఆడింది.

ఇప్పుడు వీర‌సింహారెడ్డి 50 రోజుల పండ‌గ పూర్తి చేసుకుంది. బాల‌య్య‌కు ప‌ట్టున్న సీడెడ్‌తో పాటు చిల‌క‌లూరిపేట లాంటి చోట్ల 100 రోజులు పూర్తి చేసుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక వీర‌సింహారెడ్డి 50 రోజులు పూర్తి చేసుకోవ‌డంతో ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ఓ ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టాడు. బాల‌య్య‌తో సినిమా చేయ‌డం ఓ మ‌ర్చిపోలేని అనుభూతి అని… లెక్క‌లేన‌న్ని జ్ఞాప‌కాలు మీరు అందించారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారితో ఒకవీర మాస్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం ఒక క‌ల లాంటిది అంటూనే బాల‌య్య త‌న ధ‌న్యవాదాలు తెలియ‌జేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news