Moviesశ్రీకాంత్ కొడుకు రోష‌న్‌పై ఆ గోల్డెన్ లేడీ హ్యాండ్ ప‌డిందే…!

శ్రీకాంత్ కొడుకు రోష‌న్‌పై ఆ గోల్డెన్ లేడీ హ్యాండ్ ప‌డిందే…!

టాలీవుడ్ లో ఎక్కువగా మేల్‌ డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది. హీరోలు సంవత్సరాలు.. సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంటారు. హీరోయిన్లు 10 ఏళ్లకు మించి ఇండస్ట్రీలో కొనసాగే పరిస్థితి లేదు. అనుష్క – నయనతార లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే ఇందుకు మినహాయింపు. అలాగే టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు… లేడీ నిర్మాతలు రాణించటం కత్తి మీద సామూలాంటిదే. అప్పట్లో విజయనిర్మల లాంటి ఒకరిద్దరూ లేడీ డైరెక్టర్లు మాత్రమే సక్సెస్ అయ్యారు. విజయనిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఆమెకు అన్ని రంగాల్లోనూ మంచి అనుభవం ఉంది.

అందుకే ఎక్కువ సినిమాల‌కు దర్శకత్వం వహించిన మహిళా దర్శకరాలుగా రికార్డుల్లో నిలిచిపోయారు.
ఇక మహిళ నిర్మాతల విషయానికి వస్తే సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. ప్రస్తుతం కాస్త ఫేమస్ అయిన వారిలో హీరో నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి.. ఒకటి రెండు సినిమాలు నిర్మించారు. అంతకుమించి ఆమె గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. అయితే ఎంతో చరిత్ర ఉన్న వైజయంతి మూవీస్ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.. అగ్ర నిర్మాత అశ్వినీద‌త్‌ వారసురాళ్లు ఇద్దరు కుమార్తెలు ప్రియాంక – స్వప్నాదత్.

స్వప్న సినిమా బ్యానర్ పై మంచి సినిమాలు నిర్మిస్తూ అభిరుచి కల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు.
వీరు తీసింది తక్కువ సినిమాలే అయినా.. ఈ సినిమాలకు చాలా మంచి పేరు వచ్చింది. ఎవడే సుబ్రహ్మణ్యం – మహానటి – జాతిరత్నాలు ఇలా ఈ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్. అలాగే ఇదే బ్యానర్ లో వచ్చిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. స్వప్నదత్ అంటేనే టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అన్న బిరుదు తెచ్చుకున్నారు.

ఆమె బ్యానర్ నుంచి.. ఆమె నిర్మాతగా సినిమా వస్తుంది అంటే చాలు కచ్చితంగా సినిమా హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు స్వప్న గోల్డెన్ హాండ్ ఓ యంగ్ హీరో మీద పడింది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు శ్రీకాంత్ తనయుడు రోషన్. రోషన్ చేసిన‌ నిర్మలా కాన్వెంట్ – పెళ్లిసందడి సినిమాలు అతడిని హీరోగా సరిగా ఎలివేట్ చేయలేదు. తాజాగా ఇప్పుడు స్వప్నద‌త్ నిర్మాతగా రోషన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు ఇప్పటికే కొన్ని లఘు సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ప్రతిభను గుర్తించే స్వప్న.. రోషన్ హీరోగా తన బ్యానర్ లో తీసే సినిమాకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా యాక్షన్ ఫిరియాడిక్ జోన‌ర్లో ఉంటుందని తెలిసింది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఏదేమైనా స్వప్న గోల్డెన్ హ్యాండ్ ప‌డితే రోషన్ ఎలాంటి స్టార్ అవుతాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news