MoviesPoonam Kaur టాలీవుడ్‌లో ఆ కార‌ణంతోనే తొక్కేస్తున్నారు.. పూన‌మ్‌కౌర్ సంచ‌ల‌నం..!

Poonam Kaur టాలీవుడ్‌లో ఆ కార‌ణంతోనే తొక్కేస్తున్నారు.. పూన‌మ్‌కౌర్ సంచ‌ల‌నం..!

పూనమ్‌ కౌర్ రెండేళ్ల‌ క్రితం టాలీవుడ్ లో పెద్ద సంచలనం రేపింది. ఆమె ఒక స్టార్ హీరోతో పాటు స్టార్ డైరెక్టర్ ను టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు ఎంతలా ? వైరల్ అయ్యాయో తెలిసిందే. ఒక స్టార్ హీరో తనను ప్రెగ్నెంట్ చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అర్థం వచ్చేలా పెట్టిన పోస్టింగులు తీవ్ర కల‌కలం రేపాయి. అలాగే ఆ స్టార్ హీరో పక్కన ఉంటూ ఎప్పుడు సలహాలు ఇచ్చే స్టార్ డైరెక్టర్ ను కూడా గట్టిగా టార్గెట్ చేసింది.

కాస్టింగ్ కౌచ్ వివాదం రేగినప్పుడు శ్రీరెడ్డి తర్వాత పూన‌మ్‌ కూడా అంతే వార్తల్లో నిలిచింది. పూనం పంజాబీ అమ్మాయి అయినా ఆమె పుట్టి పెరిగింది హైదరాబాదులోనే..! ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి ముందు.. ఆమె హైదరాబాదులోని పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. తేజ దర్శకత్వంలో ఆమె తొలి సినిమాలో నటించేందుకు సైన్ చేశారు. ఆ తర్వాత పదేళ్లకు పైగా టాలీవుడ్ లో ఆమె కొనసాగుతూనే వస్తున్నారు.

చిన్నాచిత సినిమాలు చేస్తున్న పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాలు మాత్రం ఆమెకు రాలేదు. తాజాగా ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పూనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనం మాట్లాడుతూ చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తాను తెలంగాణలో పుట్టిన బిడ్డను అని.. తాను ఇక్కడే పెరిగానని కంటతడి పెట్టుకున్నారు. అయితే ఇక్కడ సినీ పరిశ్రమలో కొందరు తనని పంజాబీ అమ్మాయి అంటూ వెలివేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పైగా కంటతడి పెట్టుకున్నారు. పూనం ఈ ప్రసంగం ఇస్తున్నప్పుడు పక్కనే గవర్నర్ తమిళ సైతో పాటు సీనియర్ సినిమా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ – ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్య తదితరులు కూడా ఉన్నారు. ఆమె ఒక్కసారిగా సంచాల వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తనను టాలీవుడ్ లో వెలివేస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news