Moviesనాని ఆ స్టార్ హీరోయిన్‌కు అంత వీరాభిమానా… ఆమె కోసం ఇలా...

నాని ఆ స్టార్ హీరోయిన్‌కు అంత వీరాభిమానా… ఆమె కోసం ఇలా కూడా చేశాడా…!

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన నాని అష్టాచమ్మా సినిమాతో హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి తక్కువ టైం లోనే ఎక్కువ హిట్లు కొట్టిన హీరోగా రికార్డ్ సొంతం చేసుకున్నారు. నాని గత 7 – 8 సినిమాలను చూస్తే ఒక్కో సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండా కొత్త కథలు ఎంచుకుంటున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

కెరీర్లోనే తొలిసారిగా దసరా అనే పాన్ ఇండియా సినిమాతో శ్రీరామనవమికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్న నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ? కూడా చెప్పాడు. పైగా ఆ హీరోయిన్ కు తాను వీరాభిమాని అని చెప్పుకువచ్చాడు. మరి నాని వీరాభిమాని అయిన ఆ హీరోయిన్ ఎవరో కాదు ? దివంగత అందాల అతిలోకసుందరి శ్రీదేవి.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్షణంక్షణం (1991) సినిమాలో శ్రీదేవిని అలా తెరమీద చూడటం.. తనకు ఇప్పటికీ ఒక పెద్ద కలగానే అనిపిస్తుందని నాని చెప్పాడు. ఇక తన జీవితంపై శ్రీదేవి ప్రభావం కూడా చాలా ఎక్కువగా పడిందని.. నా డ్రీమ్ డేట్ కూడా కచ్చితంగా శ్రీదేవి అని.. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు ఆమె మన మధ్య లేరని నాని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను పెద్ద అవుతున్న కొద్దీ శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా అని.. ఇప్పటికీ కూడా ఆమె అంటే తనకు ఎంతో ఇష్టం.. పెద్ద అభిమానిని అని నాని చెప్పాడు. మరి శ్రీదేవిని అంతగా ఇష్టపడిన నానికి.. కనీసం ఆమె కుమార్తె జాన్వీకపూర్ తో అయినా నటించే అవకాశం వస్తుందేమో ? అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక నాని దసరా సినిమా విషయానికి వస్తే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని ధరణి అనే పాత్రలో కనిపిస్తున్నాడు. నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలతో రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news