Moviesలక్ష్మి ప్రణతి కి ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే చచ్చేంత ఇష్టం.....

లక్ష్మి ప్రణతి కి ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే చచ్చేంత ఇష్టం.. ఎవరు కొనిఇచ్చారో తెలుసా..? చో చ్వీట్ ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి ఇట్టే వైరల్ అయిపోతున్నాయి . గతంలో అంటే స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు .. ఏ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు .. జనాలకి తెలిసేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్నాయి .

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి చేతి కి ఉన్న హ్యాండ్ బ్యాగ్.. ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . చూడడానికి చాలా స్టైలిష్ గా చాలా ట్రెండీగా ఉండే ఈ హ్యాండ్ బ్యాగ్ అమ్మాయిలకు తెగ నచ్చేసింది. అందుకే దీనికి సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ హ్యాండ్ బ్యాగ్ ని గిఫ్ట్ చేసింది ఎవరో కాదు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ భార్య ఉపాసన అంటూ తెలుస్తుంది.

వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ హీరోల భార్యలైనప్పటికీ చాలా క్లోజ్ గా హెల్తీ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే తారక్ భార్య లక్ష్మీ ప్రణతి కి ఉపాసన ఈ హ్యాండ్ బ్యాగ్ ని గిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ దాదాపు 3, 28, 145 అంటూ తెలుస్తుంది . అలాగే ఆమె ధరించిన డ్రెస్ కూడా ఉపాసన గిఫ్ట్ చేసిందట. ఈ డ్రెస్ కాస్ట్ సుమారు 45000గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ విధంగా తారక్ భార్యకు ఉపాసన మంచి ఫ్రెండ్ గా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . అంతేకాదు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే కొనసాగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news