Moviesక‌ళ్యాణికి ' ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు ' సినిమా ఇంత స్పెష‌లా…...

క‌ళ్యాణికి ‘ ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు ‘ సినిమా ఇంత స్పెష‌లా… వామ్మో ఇదేం ట్విస్ట్‌..!

కళ్యాణి అలియాస్ కావేరి.. మలయాళ ముద్దుగుమ్మ. కేరళలో పుట్టిన ఈ అమ్మడు మలయాళం లోనే బాల‌నటిగా సినిమాల్లో నటించింది. చెల్లిగా, అక్కగా చిన్న చిన్న పాత్రలలో దాదాపు 10 ఏళ్ల పాటు నటించింది. ఇక శేషు సినిమా ద్వారా తెలుగులో తొలిసారి హీరోయిన్ గా కనిపించి అందరిని ఆకర్షించింది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అట్టర్ ప్లాప్ అయింది. కళ్యాణి మలయాళీ అమ్మాయి అయినా ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ. శేషు సినిమాలో రాజశేఖర్ కన్నా కళ్యాణికి ఎక్కువ మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత ఆమె కెరీర్ ను వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా మలుపు తిప్పింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో కళ్యాణి వెను తిరిగి చూసుకోలేదు. మూడు నాలుగేళ్లపాటు వరుసపెట్టి చక చక సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అప్పట్లో మీడియం రేంజ్ హీరోలకు కళ్యాణి మంచి ఆప్షన్ గా ఉండేది. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాకు కళ్యాణికి నంది అవార్డు కూడా వచ్చింది.

ఇక ఈ సినిమా కళ్యాణికి ఎంతో స్పెషల్. సినిమా మొత్తంలో ఆమె బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కళ్యాణి మొత్తం నలుపు కాంబినేషన్ ఉన్న కాటన్ చీరలే కట్టుకుంది. సినిమా హిట్ అయ్యాక ఆ కాటన్ చీరలను పట్టుచీరలు కన్నా ఎంతో గొప్పవిగా భావించి.. నిర్మాతను అడిగి మరీ ఆ చీరలు మొత్తం తన ఇంటికి తీసుకు వెళ్లిందట. ఆ సినిమా హిట్ అయ్యాక వరుసగా పెళ్ళాంతో పనేంటి, వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు, పందెం ఇలా వరుస పెట్టి తెలుగు సినిమాలలో నటించింది.

ఈ క్రమంలోనే సత్యం సినిమా డైరెక్టర్ సూర్యకిరణ్ తో పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగాయి. ఇక మనస్పర్ధల నేపథ్యంలో వీరిద్దరూ ఇప్పుడు విడాకులు కూడా తీసుకున్నారు. కళ్యాణి తెలుగులో చివరగా 2019లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర సినిమాలో హీరోయిన్ కి తల్లి పాత్రలో కనిపించారు. కళ్యాణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రీఎంట్రీ ఇచ్చినా.. ఆమెకు తెలుగులో మంచి పాత్రలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news