Moviesక‌లెక్ష‌న్ల దుమ్ము రేపిన ' ద‌స‌రా ' … మైండ్ బ్లాకింగ్...

క‌లెక్ష‌న్ల దుమ్ము రేపిన ‘ ద‌స‌రా ‘ … మైండ్ బ్లాకింగ్ వ‌సూళ్ల‌తో రికార్డుల రారాజుగా నాని..!


నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా శ్రీరామనవమి సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. నాని కెరీర్ లోనే తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా దసరా తెరకెక్కింది. రు. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టేబుల్ లాస్‌తో రిలీజ్ అయింది. కొత్త దర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాకు అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా ? అన్న సందేహాలు నెలకొన్నాయి.

అయితే తొలిరోజు తొలి షో పడిన వెంటనే సినిమాపై ఉన్న అనుమానాలు అన్ని పటా పంచ‌లు అయిపోయాయి. నాని తన నట విశ్వరూపం చూపించేసాడని.. దసరా సినిమా మాస్‌కు పిచ్చపిచ్చగా నచ్చేసింది అని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక పండగ కానుకగా రిలీజ్ కావటం కూడా దసరాకు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు తొలి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటేనే రు. 25 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన దసరా 14.22 కోట్ల షేర్ రాబట్టింది.

అటు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతోనే దిమ్మతిరిగే వసూళ్లు రాగా.. తొలిరోజు పూర్తయ్యేసరికి 8 లక్షల 50 వేల డాలర్ల వసూళ్లు రాబట్టినట్టు అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు. ఇక రెండు రోజులకే ఈ సినిమా చాలా సులువుగా మిలియ‌న్ మార్క్ వసూళ్లను దాటేయనుంది. ఏదేమైనా నానీ కెరియర్ లో దసరా వసూళ్లు తొలిరోజుపరంగా సరికొత్త రికార్డు లు సెట్ చేశాయి.

ద‌స‌రా ఏరియా వైజ్ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఇలా ఉన్నాయి…
నైజాం – 6.78 కోట్లు
సీడెడ్ – 2.36 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 1.42 కోట్లు
ఈస్ట్ – 90 ల‌క్ష‌లు
వెస్ట్ – 55 ల‌క్ష‌లు
గుంటూరు – 1.22 కోట్లు
కృష్ణా – 64 ల‌క్ష‌లు

నెల్లూరు – 35 ల‌క్ష‌లు

ఏపీ + తెలంగాణ = 14.22 కోట్లు (షేర్ )

ఏపీ, తెలంగాణ గ్రాస్ = 24.85 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news