Moviesఆ స్టార్ హీరో చేతిలో మోసపోయిన శ్రీవిద్య స‌న్యాసం తీసుకున్నారా ?

ఆ స్టార్ హీరో చేతిలో మోసపోయిన శ్రీవిద్య స‌న్యాసం తీసుకున్నారా ?

తూర్పు – ప‌డ‌మ‌ర, రావ‌ణుడే రాముడైతే.. వంటి సినిమాల‌తో త‌న‌కంటూ..అభిమానుల‌ను సంపాయించుకు న్న నాటి త‌రం హీరోయిన్ శ్రీవిద్య‌. బొద్దుగా ఉండే ఈమెను అనేక మంది అభిమానించేవారు. ముఖ్యంగా దాస‌రి నారాయ‌ణ‌రావు సినిమాల్లో శ్రీవిద్య ఎక్కువ‌గా న‌టించారు. ఆయన ఒక‌ప్పుడు తీసిన‌..అనేక సినిమా ల్లో శ్రీవిద్యే హీరోయిన్‌గా ఉండేది. త‌మిళం, క‌న్నడ సినిమాల్లోనూ శ్రీవిద్య రాణించారు.

ముఖ్యంగా తూర్పు-ప‌డ‌మ‌ర సినిమాతో ఒక ద‌శాబ్దం పాటు.. ఆమె తెలుగు సినీ ప్ర‌పంచాన్ని ఏలుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆమె బాడీ షేప్ కార‌ణంగా.. అవ‌కాశాలు పెద్ద‌గా రాలేదు. అయితే.. శ్రీవిద్య జీవితంలో అనేక ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయ‌ని అంటారు. ఆమె సినిమ‌మా ఇండ‌స్ట్రీలో ఉండ‌డంతో సినిమా వాళ్ల‌ను బాగా న‌మ్మారు. క‌మ‌ల్‌హాస‌న్‌ను పిచ్చిగా ప్రేమించారు.

అయితే క‌మ‌ల్ ఆమెను వాడుకుని మోసం చేశార‌ని అంటారు. త‌ర్వాత ఓ డైరెక్ట‌ర్ కూడా ఆమెను న‌మ్మించి ప్రేమిస్తున్న‌ట్టు చెప్పి వాడుకుని మోసం చేశారు. దీంతో ఆమె జీవితంలో బాగా కుంగిపోయింది.
ఆమె క‌ర్ణాట‌క‌కు చెందిన వ్యాపార వేత్త‌ను వివాహం చేసుకున్నారు. కానీ, త‌ర్వాత‌.. విడాకులు తీసుకుని.. త‌మిళ సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుడిని పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా బెడిసి కొట్టింది. దీనికితోడు.. పెళ్లి త‌ర్వాత‌.. చాలా వ‌ర‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయట‌.

దీంతో చాలా రోజులు మౌనంగా ఉండిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆమె.. మాతా శివ‌చైత‌న్య ఆశ్ర‌మంలో చేరిపోయార ని అంటారు. చాన్నాళ్లు అక్క‌డే ఉన్నార‌ని.. స‌న్యాసం తీసుకున్నార‌ని.. కూడా సినీ రంగంలో ప్ర‌చారం జ‌రిగింది. త‌ర్వాత‌.. ఒక సినిమాలో అనూహ్యంగా శ్రీవిద్య మెరిశారు. త‌న‌కు మ‌న‌శ్శాంతి కోసం.. శివ చైత‌న్య ఆశ్ర‌మంలో ఉంటున్న‌ట్టు చెప్పారు. స‌న్యాసం పుచ్చుకోలేద‌న్నారు. సినీ ప్ర‌పంచంలో తాను చాలా కోల్పోయాయ‌ని.. తాను చేసుకున్న‌దేన‌ని ఆమె అనేక సంద‌ర్భాల్లో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news