MoviesAnnie స్టార్ హీరోయిన్ల‌ను మించిపోయేలా రాజ‌న్న సినిమాలో చిన్నారి… క‌ళ్లు జిగేల్‌మ‌నే...

Annie స్టార్ హీరోయిన్ల‌ను మించిపోయేలా రాజ‌న్న సినిమాలో చిన్నారి… క‌ళ్లు జిగేల్‌మ‌నే అందం రా బాబు..!

చిన్న‌ప్పుడు చాలా సినిమాల్లో చిన్నారి వేషాలు వేసిన పిల్ల‌లు పెద్ద‌య్యాక చూస్తే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేం. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న పిల్ల‌ల వేషాలు వేసి పెద్ద‌య్యాక చూస్తే వాళ్లు గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోతుంటారు. వెంక‌టేష్ నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాలో పింకీ పాత్ర వేసిన అమ్మాయిని ఇప్పుడు చూస్తే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేం. హీరోయిన్ల‌ను మించిన అందంతో కైఫెక్కిస్తోంది

అలాగే నాగార్జున హీరోగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌న్న సినిమా వ‌చ్చింది. తెలంగాణలోని పోరాటోద్య‌మ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ఓ చిన్నారి కూడా న‌టించింది. ఆమె పేరు అన్నీ.
రాజ‌న్న రాజ‌న్న అంటూ చిన్నారిగా న‌టించిన అన్నీ ఇప్పుడు పెద్ద‌ది అయ్యింది. మ‌ల్ల‌మ్మ పాత్ర‌లో న‌టించి ఎంద‌రో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఆమె ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు చెల్లిగా కూడా క‌నిపించింది.

అటు సినిమాల‌తో పాటు ఇటు సోష‌ల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తోంది. రాజ‌న్న సినిమా వ‌చ్చి 10 ఏళ్లు దాటేసింది. ఇప్పుడు ఆ అన్నీ పెద్ద‌ది అయిపోయింది. ఆమెను చూస్తుంటే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే మంచి ఛాన్సులు ద‌క్కించుకోవ‌డం ప‌క్కా అనిపించేంత అందంగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోల‌కు మంచి కామెంట్లు, లైకులు ప‌డుతూ ఉంటాయి.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి. అన్నీ ర‌వితేజ విక్ర‌మార్కుడు సినిమాలోనూ న‌టించింది. అలాగే గ‌తేడాది ఓ వెబ్‌సీరీస్‌లోనూ ఆమె న‌టించి మెప్పించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news