MoviesPushpa పుష్ప 2 లో బాలయ్య మరదల పిల్ల.. ఇక రచ్చో...

Pushpa పుష్ప 2 లో బాలయ్య మరదల పిల్ల.. ఇక రచ్చో ర‌చ్చ‌స్య ర‌చ్చోభ్యః..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ బ్యూటీ హనీ రోజ్.. పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో కి వచ్చి చాలా కాలమే అవుతున్న .. ఇప్పటివరకు తెలుగులో హనీ రోజ్ పేరు వినిపించిందే లేదు . తెలుగులో కూడా అమ్మడు ఓ సినిమా చేసింది. అయినా కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. కాగా రీసెంట్గా బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ .. బాలయ్య మరదలు పాత్రలో కనిపించి మెప్పించింది .

సినిమాలో శృతిహాసన్ లాంటి హాట్ హీరోయిన్ ఉన్నా సరే అందరి కళ్ళు హనీ రోజ్ పైనే పడ్డాయి . ఈ క్రమంలోనే హనీ రోజ్ ఎంత అందగత్తనేది అందరికీ తెలిసిపోయింది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయనే పాటలో హనీ రోజ్ ఆడి పాడి అలరించిన తీరు అందరికీ నచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరుని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. కాగా వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అయిన తర్వాత హాని రోజ్ ఖాతాలో ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పడ్డాయి . అందులో ఒకటే పాన్ ఇండియా లవెల్లో తెరకెక్కుతున్న పుష్ప2.

ఎస్ పుష్ప 2 సినిమాలో సుకుమార్ ఓ ఇంపార్టెంట్ పాత్ర కోసం హనీ రోజ్ ని సెలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం అనసూయ చెల్లెలుగా హనీ రోజ్ తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతుందట . ఈ క్రమంలోనే బన్నీ – హనీ రోజ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది . కాగా రీసెంట్ గానే వైజాగ్ లో పుష్ప2 సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు మేకర్స్ . ఏది ఏమైనా పుష్ప 2 విషయంలో సుకుమార్ క్రేజీ ప్లాన్స్ తో దూసుకుపోతున్నాడు . కచ్చితంగా ఈ సినిమా బన్నీ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news