Moviesబెల్లం చుట్టు ఈగలు లా.. విజయ్ దేవరకొండ చుట్టు అమ్మాయిలు ఉండటానికి...

బెల్లం చుట్టు ఈగలు లా.. విజయ్ దేవరకొండ చుట్టు అమ్మాయిలు ఉండటానికి కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా.. యంగ్ హీరోస్ ఉన్నా.. ప్రజెంట్ అమ్మాయిలందరూ ఒకటే పేరు జపం చేస్తున్నారు. అదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈ విజయ్ దేవరకొండ ..బాలీవుడ్ ని ఓ రేంజ్ లో అల్లాడిస్తున్నారు . ఇప్పటివరకు బాలీవుడ్ లో ఆయన ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు.. కానీ బాలీవుడ్ లో ఉండే హీరోయిన్స్ లో సగానికి మందికి పైగానే విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ చేయడానికి రెడీగా ఉన్నారు.

అంత ఎందుకు స్టార్ డాటర్ జాన్వీ కపూర్.. సారా అలీ ఖాన్ సైతం విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని అతనితో డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సన్స్ ఉన్నా కానీ అందరూ విజయ్ దేవరకొండ చుట్టూ తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హీట్ ని అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా యాటిట్యూడ్ హీరోగా మారిపోయాడు .

ఈ క్రమంలోని అర్జున్ రెడ్డి సినిమాలో అతని యాటిట్యూడ్ చూసిన విజయ్ దేవరకొండను ..ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని .. మరి ముఖ్యంగా అమ్మాయిలకు సైలెంట్ గా ఉండే అబ్బాయిల కన్నా నాటిగా సెక్సీగా బిహేవ్ చేసే హీరోస్ అంటేనే ఇష్టమని.. ఈ కారణంగానే విజయ్ దేవరకొండ ని ఎక్కువ మంది లైక్ చేస్తున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు మన తెలుగు ఇండస్ట్రీలో సైతం చాలా మంది హీరోయిన్స్ విజయ్ దేవరకొండ తో నటించడానికి రెడీగా ఉన్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..విజయ్ దేవరకొండ గురించి చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే . ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ లాంటి హీరోనే కావాలి అంటూ ఓపెన్ గా చెప్పేసింది . ఈ కారణంగానే విజయ్ దేవరకొండ ను అమ్మాయిలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news