Moviesబాలయ్య లో ఉన్నది..చిరంజీవిలో లేనిది..ఇదే..!!

బాలయ్య లో ఉన్నది..చిరంజీవిలో లేనిది..ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా బాలయ్య – చిరంజీవి పేరు చెప్తే ఫాన్స్ ఏ రేంజ్ లో ఊగిపోతారో అందరికీ తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో చెరగని ముద్రతో తమ పేర్లను కొనసాగిస్తున్న బాలయ్య – చిరంజీవి ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్లు అంటూ సినీ ప్రముఖులు పెద్ద మనుషులు కూడా చెప్పుకొస్తూ ఉంటారు. కాగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ తమ సొంత హీరోల విషయాల పై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా బాక్స్ ఆఫీస్ టఫ్ ఫైట్ ఇవ్వబోతున్న బాలయ్య – చిరంజీవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని జనాలు ట్రెండ్ చేస్తున్నారు .

నందమూరి నట సింహం బాలయ్య లో ఉన్నది.. చిరంజీవిలో లేనిది అదే అంటూ కొందరు ఫాన్స్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ వీరసింహారెడ్డి పేరుతో నందమూరి బాలకృష్ణ జనవరి 12వ తేదీ గ్రాండ్గా థియేటర్ లో సందడి చేయబోతున్నాడు. కాగా ఇదే క్రమంలో ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు లోపే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో జనాలను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు . కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ని కంపేర్ చేస్తూ మెగా ఫాన్స్ మెగాస్టార్ కి.. నందమూరి ఫ్యాన్స్ బాలకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారు .

ఇదే క్రమంలో బాలయ్యలో ఉన్న ఆ గుడ్ క్వాలిటీ చిరంజీవిలో లేదని … అదే ఆయనకు మైనస్ అయిందని కొందరు ఫాన్స్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది . మనకు తెలిసిందే నందమూరి బాలయ్య కు కోపం ఎక్కువ .. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడేస్తాడు .. ఎదుటివారు ఎంతటి పెద్దమనిషి అయినా సరే తప్పు చేస్తే నిలతీయడం బాలయ్యలో మొదటి నుంచి మనం చూస్తున్న లక్షణం . అయితే చిరంజీవి ఆ టైప్ కాదు .

ఎదుట ఉన్నది ఎలాంటి వాడినైనా సరే క్షమించేస్తాడు . తనపై రూమర్స్ క్రియేట్ చేసే గాసిప్ రాయళ్లను ఎన్నోసార్లు క్షమించి వదిలేసారు . అంతేకాదు రాజకీయాలలో తనను నమ్మించి ముంచేసిన స్నేహితులను సైతం చిరునవ్వుతో చిరంజీవి పలకరించడం మనం చూస్తూనే ఉన్నాం . కాగా అదే పొజిషన్లో బాలయ్య ఉంటే మాత్రం షర్ట్ కాలర్ పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇదే బాలయ్యకు ప్లస్ చిరంజీవి కు మైనస్ అయింది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news