Moviesఫస్ట్ డే బాక్సాఫీస్ దుమ్ముదులిపేసిన "వాల్తేరు వీరయ్య".. మెగా మాస్ జాతరే..!!

ఫస్ట్ డే బాక్సాఫీస్ దుమ్ముదులిపేసిన “వాల్తేరు వీరయ్య”.. మెగా మాస్ జాతరే..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టాలెంటెడ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో నటించడమే అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే ఫస్ట్ మెగా ఫ్యాన్స్ భయపడ్డారు .

బాబి చాలా సైలెంట్ డైరెక్టర్ ..మెగా ఫ్యాన్స్ కి సైలెంట్ గా ఉంటే అసలు నచ్చదు . మరి అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ తో మాస్ సినిమా అంటే కచ్చితంగా జనాల్లో భయం ఉంటుంది . అయితే అలాంటి భయాలని పోగొట్టేసాడు బాబి . బొమ్మ పడిన మొదటి షోకే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఫస్ట్ డే వాల్తేరు వీరయ్య కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద మెగా మాస్ జాతరను క్రియేట్ చేసింది .

అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఇండియా వైడ్ గా టోటల్ 29 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు గాట్ ఫాదర్ తో కంపేర్ చేస్తే వాల్తేరు వీరయ్య ఎన్నో రెట్లు బెటర్ ..అయితే వీర సింహారెడ్డి సినిమాతో కంపేర్ చేస్తే మాత్రం వాల్తేరు వీరయ్య వెనక పడిందనే చెప్పాలి. ఏది ఏమైనా సరే కలెక్షన్స్ కన్నా ముఖ్యంగా టాక్ పరంగా రెండు సినిమాలు పాజిటివ్ వే తో దూసుకుపోతున్నాయి . ఇదే విధంగా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య బ్రేక్ ఈవెన్ సాధించేస్తుంది అంటూ జనాలు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news