Moviesసీనియర్ నటి జమున మృతి.. ఆమె జీవితంలో ముఖ్య ఘ‌ట్టాలు ఇవే!

సీనియర్ నటి జమున మృతి.. ఆమె జీవితంలో ముఖ్య ఘ‌ట్టాలు ఇవే!

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. లెజెండ్రీ న‌టి జ‌మున(86) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. వయసు ప్రభావంతో పాటు ఆరోగ్య సమస్యలతో నేడు హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె మృతి చెందారు. ఆమె మ‌ర‌ణ వార్త తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదంలోకి నెట్టేసింది. ఇక‌పోతే జ‌మున జీవితంలో ముఖ్య ఘ‌ట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

– జమున 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. జ‌మున తండ్రి ఒక వ్యాపార‌వేత్త‌- 1953లో పుట్టిల్లు సినిమాతో జమున సినీ ఆరంగేట్రం చేశారు. తొలి సినిమా చేసినప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళు. – ఎల్వీ ప్రసాద్ తీసిన `మిస్సమ్మ`తో జ‌మున‌కు ఫస్ట్ బ్రేక్ వచ్చింది.-ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె.

వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామగా జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది.- తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి జ‌మున‌ 198 సినిమాలు చేశారు. తెలుగులో నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

Jamuna : సీనియర్ నటి కన్నుమూత | Senior actress Jamuna expired PVCH

– హిందీ దాదాపు సినిమాలలో నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా జ‌మున‌కు ఫిలింఫేర్ అవార్డు లభించింది.- 2008లో జ‌మున‌ ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

Actress Jamuna Says I'm The First Heroine Of Hyderabad | SouthColors

-1965లో ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జూలూరి రమణారావును ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి జ‌న్మించారు.- సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన హీరోయిన్ల జామితాలో జ‌మున అగ్రస్థానంలో ఉంటారు. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. రాజకీయాల నుంచి వైదొలిగారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news