Moviesరవితేజ సెంటిమెంట్‌కు బాల‌య్య చెక్‌... వీరసింహాతో అలా చేస్తారా...?

రవితేజ సెంటిమెంట్‌కు బాల‌య్య చెక్‌… వీరసింహాతో అలా చేస్తారా…?

సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ రవితేజ మధ్య గ్యాప్ ఉందని ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒక హీరోయిన్ వల్ల బాలయ్య రవితేజ మధ్య దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి. అయితే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య రవితేజ తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని వైరల్ అయిన వార్తలు ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే బాలయ్య, రవితేజ సినిమాలు థియేటర్లలో ఒకేసారి విడుదలైన సమయంలో మెజారిటీ సందర్భాల్లో రవితేజ పైచేయి సాధించారు.

2008 సంవత్సరంలో రవితేజ నటించిన కృష్ణ, బాలయ్య నటించిన ఒక్క మగాడు సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో కృష్ణ సినిమా పైచేయి సాధించింది. 2009 సంవత్సరంలో మిత్రుడు, కిక్ సినిమాలు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో మిత్రుడు సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే కిక్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

2011 సంవత్సరంలో రవితేజ మిరపకాయ్, బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో కూడా మిరపకాయ్ సినిమానే హిట్ గా నిలిచింది. 2013లో వీర, శ్రీరామరాజ్యం సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కాగా ఈ సినిమాలలో ఏ సినిమాకు ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు అయితే రాలేదు. అయితే ఈ సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో రవితేజ వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ సాధించినా వీరసింహారెడ్డితో కూడా సక్సెస్ సాధించి బాలయ్య ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రవితేజ సెంటిమెంట్ కు బాలయ్య చెక్ పెడతారని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అఖండను మించిన హిట్ సాధించబోతున్నామని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news