Moviesపండగ పూట ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. కేకపెట్టించేసాడుగా..!!

పండగ పూట ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. కేకపెట్టించేసాడుగా..!!

ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి . గత సంవత్సర కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు . నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు . మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో నటించబోతున్నాడు.

ఇన్నాళ్లు ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వలేదు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు . కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు కొరటాల శివ . అంతే కాదు సినిమా 2024 ఏప్రిల్ 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం ఫారిన్ వెళ్ళిన ఎన్టీఆర్ ..ఇండియాకి తిరిగి వచ్చాడు.

ఆయన ఇండియాకి తిరిగి వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోని మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని ఇక వరుసగా అప్డేట్స్ వస్తాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..? కొత్త లుక్ లో తారక్ కేక పెట్టిస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news