Moviesరష్మిక నోటి దూల..ఆ సంస్ధకి బ్రాండ్ అంబాసిడర్ గా తొలగింపు..!!

రష్మిక నోటి దూల..ఆ సంస్ధకి బ్రాండ్ అంబాసిడర్ గా తొలగింపు..!!

నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడ ముద్దుగుమ్మయిన ఈ అందాల తార ఇప్పటివరకు సూపర్ డూపర్ హిట్ అయిన కాంతారా సినిమా చూడకపోవడం దారుణం అంటూ కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. రష్మిక ఎందుకు చూడలేదు అంటూ ఫైర్ అవుతున్నారు.

మనకు తెలిసిందే రష్మిక మందన రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . కాగా ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య వివాదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. కాగా ఆ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ఇప్పుడు పెద్ద వార్ అయ్యింది. ఆ గొడవే ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతే కాదు రిషబ్ శెట్టి సైతం రష్మిక సినిమాతో చేయను అంటూ పరోక్ష కామెంట్స్ చేసాడు. ఈ క్రమంలోనే కన్నడ ప్రజలు రష్మిక బి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా దీని కారణంగా రష్మిక మందన దాదాపు 5కోట్లు లాస్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. రష్మిక ప్రముఖ జ్యువలరీ సంస్థ ఖజానా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గానే ఈ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త హీరోయిన్ ని నియమించుకుంది . ఆ బాధ్యతల నుండి రష్మిక ని తొలగిస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చింది. కొన్ని అనివార్య కారణాల కారణంగా ఖజానా బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక ని తొలగిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది . దీంతో రిషబ్ శెట్టి వివాదంతోనే రష్మిక మందన ఇంత పెద్ద సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా తీసేసిందని జనాలు కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఆమె ప్లేస్ లోకి చెన్నై చంద్ర త్రిషని తీసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news