Moviesమెగాస్టార్ - న‌ట‌సింహం మ‌ల్టీస్టార‌ర్‌కు క‌థ రెడీ చేసిన బాల‌కృష్ణ‌... అబ్బా...

మెగాస్టార్ – న‌ట‌సింహం మ‌ల్టీస్టార‌ర్‌కు క‌థ రెడీ చేసిన బాల‌కృష్ణ‌… అబ్బా ఏం ట్విస్టు ఇచ్చాడ్రా..!

టాలీవుడ్ లో నాలుగు దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.. నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ ఇండస్ట్రీలో రెండు వేరువేరు వర్గాల నుంచి స్టార్ హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ఎప్పుడు పోటీపడినా బాక్సాఫీస్ దగ్గర వాతావరణం ఎలా ? వేడెక్కుతుందో చెప్పక్కర్లేదు. బాలయ్య, చిరు సంక్రాంతికి పోటీ పడితే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఐదేళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ హీటెక్కించారు. ఈ ఇద్దరు వచ్చే సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో మరోసారి పోటీ పడుతున్నారు.

బాలయ్య – చిరు కలిసి మల్టీ స్టార‌ర్ సినిమాలో నటిస్తారని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటూ వస్తున్నారు. అయితే ఆ కలలు ఎప్పుడు ? నిజం అవుతాయి అన్నది ఎవరు చెప్పలేని పరిస్థితి. అసలు నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి ఒకే సినిమాలో చేస్తారని ఎవరు ఊహించలేదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ – రామ్ చరణ్‌తో త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించి ఒక సంచలనం క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు బాలయ్య, చిరంజీవి మల్టీ స్టార‌ర్ విషయంలోనూ ఇలాంటి సంచలనం చేసేందుకు చిరంజీవి బావమరిది, టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించారు. అలాగే ఎన్టీఆర్ తో ఎప్పుడు పోటీపడే సూపర్ స్టార్ కృష్ణ సైతం ఆయనతో కలిసి మల్టీ స్టార‌ర్ సినిమాలు చేశారు. ఈ తరం తర్వాత చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ తెలుగు వెండితెరకు నాలుగు స్తంభాలుగా నిలిచారు. అయితే ఈ నలుగురిలో ఏ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించలేదు. అందుకు సరైన కథ దొరకకపోవటం.. ఇద్దరు హీరోలను హ్యాండిల్ చేసే డైరెక్టర్ లేకపోవడం… ఈ హీరోల అభిమానుల మధ్య ఉన్న ఇగోలు కూడా వీరు మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించే వీలు లేకుండా చేశాయి.

అయితే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలయ్య అల్లు అరవింద్ తో మనిద్దరి కాంబినేషన్ బ్యాలెన్స్ ఉందని అడగగా.. మీతో చిరంజీవి గారితో కలిసి మల్టీస్టారర్ సినిమా తీద్దామని వెయిట్ చేస్తున్నట్టు అరవింద్ చెప్పారు. అయితే వెంటనే బాలయ్య తమ ఇద్దర మల్టీ స్టార‌ర్ సినిమాకు ఎలాంటి ? కథ ఉండాలో కూడా చెప్పేశాడు. బాలయ్య చెప్పిన ఈ కథ నిజంగానే అద్భుతంగా ఉంది. చిరంజీవి తన కాంబినేషన్లో వచ్చే మల్టీ స్టార్లర్ సినిమాలో చిరంజీవికి పాటలు ఉండాలి… నాకు ఫైట్స్ ఉండాలి ఇంట్రో సాంగ్ చిరంజీవిది.. క్లైమాక్స్ ఫైట్ నాది అని బాలయ్య చెప్పుకు వచ్చాడు.

 

బాలయ్య కాకతాళీయంగా ఆ మాట అన్నా… నిజంగానే చిరంజీవికి ఉన్న ఎనర్జిటిక్ డ్యాన్సులు.. తన యాక్షన్ బలం కలగలిపి స్టోరీ రాస్తే అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు. మరి చిరు – బాలయ్య ఇమేజ్ లను బ్యాలెన్స్ చేస్తూ ఆ కథ రాసే కథా రచయిత… సినిమా తీసే దమ్మున్న దర్శకుడు దొరికితే అరవింద్ తన బ్యానర్ లో ఈ ఇద్దరితో సినిమా తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక టాలీవుడ్ లో ఉన్న కోట్లాదిమంది సినీ అభిమానులు కూడా ఈ ఇద్దరు హీరోల మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నారు.. మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news