Moviesకీర్తి సురేష్‌ను క‌మిట్‌మెంట్ అడిగారా... ఎట్ట‌కేల‌కు అస‌లు విష‌యం చెప్పేసింది...!

కీర్తి సురేష్‌ను క‌మిట్‌మెంట్ అడిగారా… ఎట్ట‌కేల‌కు అస‌లు విష‌యం చెప్పేసింది…!

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ ఈ యేడాది మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టించింది. ఈ సినిమాతో ఆమె క‌మ‌ర్షియ‌ల్‌గా త‌న‌కు మంచి బ్రేక్ వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నా అది నెర‌వేర‌లేదు. కీర్తి గ‌త మూడేళ్లుగా ఎక్కువుగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల‌తో పాటు ఓటీటీ సినిమాలు చేయ‌డంతో ఆమె కెరీర్‌కు మైన‌స్‌గా మారింది. ఇక కీర్తి ఎన్ని సినిమాలు చేసినా మ‌హాన‌టి సినిమా ఆమె కెరీర్‌కు మంచి ట‌ర్నింగ్ పాయింట్‌.

ఇదిలా ఉంటే హీరోయిన్ల విష‌యంలో హాట్ టాపిక్ గా మారి ప్ర‌కంప‌న‌లు రేపుతోంది కాస్టింగ్ కౌచ్ ఉదంతం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ క‌ల్చ‌ర్ పై కీర్తి స్పందించింది. కాస్టింగ్ కౌచ్
ఉంద‌ని అంగీక‌రించింది కీర్తి. అయితే త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ క‌మిట్‌మెంట్ అడ‌గ‌లేద‌ని.. త‌న‌కు కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాలు ఎప్పుడూ ఎదురు కాలేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.

కాస్టింగ్ కౌచ్ అనేది ఎదుటి వ్య‌క్తిపైనే ఆధార‌ప‌డి ఉండ‌ద‌ని.. అది కేవ‌లం మ‌న ప్ర‌వ‌ర్త‌న‌మీదే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని కీర్తి చెప్పింది. మ‌నం సూటిగా, నిక్క‌చ్చిగా ఉంటే కాస్టింగ్ కౌచ్ ప్ర‌తిపాద‌న‌లు రావ‌ని.. ఇక తాను మాత్రం క‌మిట్‌మెంట్‌కు ఓకే అనే టైపు కాద‌ని .. అలాంటి సంద‌ర్భం త‌న‌కు ఎదురైతే తాను సినిమాలే మానేస్తాన‌ని కీర్తి చెప్పింది. అయితే ఇద్ద‌రు, ముగ్గురు హీరోయిన్లం క‌లిసిన‌ప్పుడు కూడా తాము కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటామ‌ని.. అలా విన‌డం కూడా త‌ప్పే… అది త‌న అనుభ‌వం లోకి ఎప్పుడూ రాలేద‌ని కీర్తి చెప్పింది.

ఇక రెండు రోజులుగా కీర్తి పెళ్లి గురించి ఒక్క‌టే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న పూర్వీకుల గ్రామం సంద‌ర్శించి అక్క‌డ గ్రామ దేవ‌త‌ల‌కు పూజ‌లు చేసింది. కీర్తి వంశంలో అమ్మాయిలు పెళ్లికి ముందు అక్క‌డ గ్రామ దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకోవ‌డం ఆచారం.. కీర్తి కూడా అలా చేయ‌డంతో ఆమె పెళ్లి పుకార్ల‌పై ఒక్క‌సారిగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే కీర్తి మాత్రం త‌న పెళ్లిపై వ‌స్తోన్న వార్త‌ల‌ను ఖండించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news