Moviesప్రభాస్ కు సిస్టర్ గా పవన్ లక్కి హీరోయిన్.. ఇదేం దరిద్రమైన...

ప్రభాస్ కు సిస్టర్ గా పవన్ లక్కి హీరోయిన్.. ఇదేం దరిద్రమైన కాంబో రా బాబోయ్..!!

ఒకప్పుడు హాట్ అందాలతో కుర్రాలను ఉడికించిన ముద్దుగుమ్మలు అందరూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు . సెకండ్ ఇన్నింగ్స్ లో వదిన, అక్క పాత్రలు చేస్తూ తమదైన స్టైల్ లో రాణిస్తున్నారు . ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి మంచి రోల్స్ తో టాప్ పొజిషన్లో ఉన్నారు. కాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది ఒకప్పటి అందాల ముద్దుగుమ్మ భూమిక . ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ లో పలు మంచి రోల్స్ ని యాక్సెప్ట్ చేసిన భూమిక గతంలో నాని కి వదినగా మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో నటించింది .

అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ధోని సినిమాలో అతడికి అక్కగా నటించింది . రీసెంట్గా మరో స్టార్ హీరోకి భూమిక అక్కగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు పాన్ ఇండియా హీరో ప్రభాస్ . మనకు తెలిసిందే ప్రభాస్ ప్రజెంట్ ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నాడో. ఒకపక్క ప్రాజెక్టుకే మరోపక్క సల్లార్ సినిమాలు చేస్తూనే మధ్యలో మారుతితో తెరకెక్కబోయే సినిమా షూట్ స్టార్ట్ చేశాడు.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రాజా డీలక్స్ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించబోతుంది . ఈ సినిమాలో ప్రభాస్ కు అక్కగా ఒకప్పటి ముద్దుగుమ్మ పవన్ లక్కీ హీరోయిన్ భూమిక నటించబోతున్నాట్లు తెలుస్తుంది. ఎంతో మంది సీనియర్స్ ని ట్రై చేసిన మారుతి నేచురల్ లుక్స్ కలిగిన భూమిక ఈ పాత్రకి సెలెక్ట్ చేశాడని న్యూస్ వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ హైట్ కి వెయిట్ కి భూమిక ఏ మాత్రం సెట్ అవ్వదు అని ప్రభాస్ లాంటి బాహుబలి ముందు భూమిక ఉడత లాగా ఉంటుందని.. ఇదేం కాంబినేషన్ బాబోయ్ అంటూ కొందరు జనాలు కామెంట్ చేయడం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ లక్కీ హీరోయిన్ అనే ముద్ర వేయించుకున్న భూమిక.. ఇలా ప్రభాస్ సినిమాలో అక్కగా నటిస్తుంది అని తెలియగానే నెగటివ్ కామెంట్స్ వినిపించడం ఆమె కెరియర్ కి మైనస్ గా మారింది అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news