Moviesసౌందర్య చచ్చిపోవడం ..ఆ హీరోయిన్ కి అంత హ్యాపీనా..?

సౌందర్య చచ్చిపోవడం ..ఆ హీరోయిన్ కి అంత హ్యాపీనా..?

టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సౌందర్య.. గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సౌందర్య తెలుగు, కన్నడం భాషలలో మంచి గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు ఆల్మోస్ట్ అందరి స్టార్స్ తో జతకట్టిన సౌందర్య ..ఎక్కువ పద్ధతిగా ఉండే రోల్స్ లోనే కనిపించింది . అందుకే ఆమెను అందరూ తెలుగింటి ఇల్లాలు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . పేరుకి కన్నడ బ్యూటీనే అయినా సరే తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్య ..ప్రజెంట్ మన మధ్యన లేరు .

అయితే సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సౌందర్య.. ఆ తరువాత రాజకీయాల్లో ఓ మీటింగ్ కోసం హెలి కాఫ్టర్ లో బయలుదేరుగా ..అది కుప్పకూలిపోయింది . ఈ ఘటనలో సౌందర్య అక్కడికక్కడే కాలి బూడిదయింది . ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ..స్టార్స్ ,సౌందర్య ఫ్యాన్స్, గుండె ఆగిపోయినంత పని అయింది . సౌందర్య ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ కి మాత్రం స్నేహ మరణం ప్లస్ అయింది అన్న రూమర్ అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

స్నేహ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సౌందర్య తర్వాత హోంలీ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ..అన్నీ హోమ్లి పాత్రలే చేస్తుంది. పద్ధతిగా చీర కట్టి ..తలలో పూలు పెట్టి ..నుదుట బొట్టు పెట్టి కుర్రాలను ఆకట్టుకుంటుంది . అయితే సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేసే అంత హీరోయిన్ స్నేహానే అంటూ అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు . ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో స్నేహాన్ని అడిగింది ఓ యాంకర్ .

ఈ క్రమంలోనే ఆమె అసలు విషయం చెప్పింది. “స్నేహ మరణించడం నాకు పాజిటివ్ కాదని ..ఇండస్ట్రీకే ఆమె లేని లోటు ఎవరి తీర్చలేనిదని ..హీరోయిన్ గా అవకాశాలు వస్తూపోతూ ఉంటాయని ..సౌందర్య వల్ల నాకు అవకాశం రాలేదు ..సౌందర్య వల్ల నాకు అవకాశాలు పోలేదు “అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో సౌందర్య చనిపోవడం వల్ల స్నేహ హోమ్లి బ్యూటీగా పేరు సంపాదించుకుంది అన్న వార్తలకు చెక్ పెట్టింది స్నేహ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news