Moviesజూనియ‌ర్ ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి వైఫ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

జూనియ‌ర్ ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి వైఫ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పరిచయం కాకముందే బాల‌నటుడిగా కొన్ని సినిమాల్లో అలరించారు. తన తాత నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా కనిపించిన ఎన్టీఆర్ 1996లో బాల రామాయణం సినిమాలో కూడా నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో అందరూ పిల్లలతో కలిసి నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా ఇది. మల్లెమాల బ్యాన‌ర్ పై ఎమ్మెస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా వంద రోజులు ఆడి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ రాముడుగా నటించగా ఈ సినిమా జాతీయస్థాయి ఉత్తమ బాలల చలనచిత్రంగా ఎంపిక చేయబడింది. ఈ సినిమాలో సీత పాత్రలో నటించిన చిన్నారి నటన అప్పట్లో ప్రేక్షకులను కట్టి పడేసింది. ముఖ్యంగా ఆమె క్యూట్ లుక్స్‌తో పాటు ఎన్టీఆర్ పక్కన సీతగా చేసిన అభినయం అద్భుతం అనిపించింది. ఆ చిన్నారి పేరు స్మిత మాధవ్. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది.

ఇప్పుడు ఈ చిన్నారి సీత ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. స్మితా మాధవ్, కర్ణాటక క్లాసికల్ సింగర్. అలాగే ఆమె భర‌త‌ నాట్యం డాన్సర్. ఆమె శృతిలయ కేంద్ర నటరాజాలయ‌ డైరెక్టర్, గురు నృత్య చూడామణి శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ ద్వారా భరతనాట్యంలో శిక్షణ పొందింది. అలాగే స్మిత హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ దగ్గర కూడా కర్ణాటక శాస్త్రియ‌ సంగీతంలో శిక్షణ పొందింది.

ఆమె తెలుగు విశ్వవిద్యాలయం నుంచే సంగీతం నృత్యంలో డిప్లొమా ప్రోగ్రాం కూడా పూర్తి చేసుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా బాల రామాయణం సినిమాలో నటించిన స్మిత రీసెంట్‌గా ఆర్ట్ ఫిలిం పృథ్విలో కూడా హీరోయిన్‌గా నటించింది. ఇక బుల్లితెరపై ఆమె అనేక షోలకు యాంకరింగ్ గా చేసింది. ఇప్పుడు స్మిత వెండితెర‌పై హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తే చూడాల‌న్న కోరిక‌తో చాలా మందే ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news