Moviesషకీలా బయోపిక్... ఈ భ‌యంక‌ర నిజాలు బ‌య‌ట‌కొస్తాయా...!

షకీలా బయోపిక్… ఈ భ‌యంక‌ర నిజాలు బ‌య‌ట‌కొస్తాయా…!

మన సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ గత కొన్నేళ్ళుగా జీవిత కథల ఆధారంగా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒరిజినల్ కంటెంట్ చెడగొట్టకుండా తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతున్నాయి. సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. కానీ, కొన్ని బయోపిక్స్ మాత్రం కనీసం పెట్టుబడిలో పదవ వంతు కూడా రాబట్టడం లేదు.

సినీ, రాజకీయ, క్రీడా కారుల బయోపిక్స్ మాత్రమే కాదు సిల్క్ స్మిత లాంటి ఐటెం భామల జీవిత కథలతో తీసిన సినిమాలు నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తుంది. సిల్క్ స్మిత బయోపిక్‌గా వచ్చిన డర్టీ పిక్చర్ హిందీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం. సిల్క్ లైఫ్‌లో జరిగినవాటిలో మేజర్ కంటెంట్ చూపించారు. అదే అన్నీ వర్గాల ప్రేక్షకులకి నచ్చింది.

ఇక దివంగ‌త మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. సావిత్రి జీవితంలో తెర‌ముందు జ‌రిగిన సంగ‌తులే కాకుండా.. తెర‌వెన‌క జ‌రిగిన సంఘ‌ట‌న‌లు కూడా తెర‌కెక్కించ‌డంతో ఈ సినిమాకు ప్రేక్ష‌కులు పిచ్చిగా క‌నెక్ట్ అయిపోయారు. అయితే, గతకొన్ని నెలలుగా మలయాళ బ్యూటీ బొద్దుభామ శృంగారతార షకీలా జీవిత కథను తెర మీదకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

షకీలా కూడా తన జీవిత కథను నవలగా రాశారు. ఒక దశలో ఆమె తన కథను వెండితెర మీదకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. కానీ, ఎందుకనో మళ్ళీ ఆ ఊసే లేదు. ఈ వార్త వచ్చినప్పటి నుంచి షకీలా సినిమాలలో చేసిన పాత్రలన్నిటినీ శృంగార సన్నివేశాలను చూపిస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.

ఒకదశలో షకీలా సినిమా వస్తుందంటే మలయాళంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యేది కాదు. కేవలం ఒక లుంగీ కట్టుకొని ఎద మొత్తం కనిపించేలా..కొన్ని సినిమాలలో పూర్తి నగ్నంగానూ నటించింది. వాటిని షకీలా బయోపిక్‌లో చూపిస్తే అదో సంచలనం అవడం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news