Moviesదగ్గుబాటి వారసుడా మజాకా.. సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డ్..శభాష్ బిడ్డా..!!

దగ్గుబాటి వారసుడా మజాకా.. సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డ్..శభాష్ బిడ్డా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది “నేను ట్రెండ్ ఫాలో అవ్వను ..ట్రెండ్ సెట్ చేస్తాను ” గతంలో ఈ డైలాగు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అప్పుడేంటి ఇప్పుడు కూడా సమయానుసారం.. ఈ డైలాగ్ ను వాడుతూనే ఉంటాం . కాగా ప్రెసెంట్ ఈ డైలాగును వెంకటేష్ కి అప్లై చేస్తున్నారు జనాలు. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా వెంకటేష్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దగ్గుబాటి వారసుడు వెంకటేష్ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు .

తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో ఫ్యామిలీ హీరోగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ క్రేజ్ మార్చేసుకున్న వెంకటేష్.. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ.. తన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లోను వెంకటేష్ తనదైన స్టైల్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు వెంకటేష్ పేరు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ గా మారింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ్ లో అసురన్ రీమిక్ గా తెలుగులో వచ్చిన సినిమా నారప్ప . ఈ సినిమాలో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు . ప్రియమణి హీరోయిన్గా నటించిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ మూమెంట్లో ..ఓటీపీలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది . అయితే ఈ యాక్షన్ సీన్స్ ..వెంకటేష్ డైలాగ్ డెలివరీ ..థియేటర్లో పెద్ద స్క్రీన్ లో చూస్తే ఆ మజానే వేరు అంటూ జనాలు కామెంట్స్ చేయడంతో ఆ ఫ్యాన్స్ కోరికను తీర్చడానికి వెంకటేష్ ఓటీడీలో రిలీజ్ అయిన సినిమాను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు .

డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నారప్ప సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఓటీటీ లో విడుదలైన తర్వాత థియేటర్లో వస్తున్న ఫస్ట్ సినిమాగా నారప్ప రికార్డు నెలకొల్పింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియమణి వెంకటేష్ భార్యగా సూపర్ గా నటించింది. నాజర్ ,రావు రమేష్, రాజీవ్ కనకాల, ఝాన్సీ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ 13న థియేటర్స్ లో విడుదలై ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందా ..? అని ఈగరుగా వెయిట్ చేస్తున్నారు వెంకటేష్ ఫాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news