Moviesఆ సినిమాతో ఇద్దరు తమ్ముళ్లను కోలుకోలేని దెబ్బ కొట్టిన చిరంజీవి...పవన్‌ను అలా...

ఆ సినిమాతో ఇద్దరు తమ్ముళ్లను కోలుకోలేని దెబ్బ కొట్టిన చిరంజీవి…పవన్‌ను అలా నాగబాబును ఇలా …!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య పోటీ కామ‌న్. ముఖ్యంగా పండ‌గ‌ల స‌మ‌యంలో హీరోల మ‌ధ్య ఎక్కువ‌గా పోటీ కనిపిస్తుంది. స్టార్ హీరోలు అంతా అదే స‌మ‌యంలో త‌మ సినిమాల‌ను విడుద‌ల చేస్తుంటారు. ఇక సినిమాల విడుద‌ల విష‌యంలో ఒక్కోసారి త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే అనేవిధంగా కనిపించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఓ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ చిరు సైతం బాక్స్ ఆఫీస్ బ‌రిలోకి దిగారు. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కెరీర్ లో చాలా ప్ర‌యోగాత్మ‌క స‌నిమాలు చేశారు. అలా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన సినిమాల‌లో ఒక‌టి గుడుంబా శంక‌ర్. ఈ సినిమా థియేట‌ర్ ల‌లో నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ ఇదే సినిమా టీవీ లో వ‌స్తే ప్రేక్ష‌కులకు న‌చ్చింది. ఈ సినిమాకు బ‌స‌వా వీర శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఖుషి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ వీర‌శంక‌ర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాను నాగ‌బాబు నిర్మించారు. అయితే అప్ప‌టికే నాగ‌బాబు కౌరవుడు అనే సినిమాతో నిర్మాత‌గా దారుణంగా న‌ష్ట‌పోయారు. దాంతో ప‌వ‌న్ గుడుంబా శంక‌ర్ సినిమాను త‌న అన్న నిర్మాణంలోనే చేసి న‌ష్టాల నుండి గ‌ట్టెక్కించాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీరా జాస్మిన్ ను ఎంపిక చేశారు.

మీరా జాస్మిన్‌కు ఇదే తొలిసినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వ‌డంతో మ‌ధ్య‌లో శివాజీతో చేసిన సినిమా ముందుగా రిలీజ్ అయిపోయింది. దీంతో గుడుంబా శంక‌ర్ ఆమెకు రిలీజ్ ప‌రంగా రెండో సినిమా. ఈ సినిమా క‌థ నుండి పాట‌ల వ‌ర‌కూ అన్నింటా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇన్వాల్స్ మెంట్ ఉంద‌ట‌. ఈ సినిమా పాట‌లు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఊహించిన‌ట్టే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ మొద‌లైంది.

 

సినిమాలో క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను దారుణంగా నిరాశ‌ప‌రిచింది. సినిమాలో కామెడీ మ‌రియు పాట‌లు బాగుండ‌టంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ సినిమా న‌చ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమా వైపు మ‌ళ్లుతున్నారు. అయితే ఈ సినిమా విడుద‌లైన త‌ర‌వాత ఐదువారాల గ్యాప్ లో చిరంజీవి హీరోగా న‌టించిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమా విడుద‌లైంది. దాంతో గుడుంబా శంక‌ర్ క‌లెక్ష‌న్స్ పై దెబ్బప‌డింది.

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ విడుద‌ల‌తో చాలా థియేటర్ ల‌లో గుడుంబా శంక‌ర్ సినిమాను తీసేశారు. దాంతో గుడుంబా శంక‌ర్ లాంగ్ ర‌న్‌లో కేవ‌లం ప‌ద‌మూడు కోట్లు రాబ‌ట్టింది. ఈ సినిమాతో నాగబాబు ఆర్థిక ప‌రిస్థితి కూడా మెరుగుపడింది. అయితే చిరంజీవి శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమా విడుద‌ల చేయ‌క‌పోతే గుడుంబా శంక‌ర్ కు మ‌రిన్నిక‌లెక్ష‌న్స్ వ‌చ్చేవ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news