Moviesస్టార్ హీరో కూతురితో విష్ణు పెళ్లి .. అన్ని మాట్లాడుకున్నాక క్యాన్సిల్.....

స్టార్ హీరో కూతురితో విష్ణు పెళ్లి .. అన్ని మాట్లాడుకున్నాక క్యాన్సిల్.. మామ యమ లక్కి..ఎందుకంటే..!?

సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . మోహన్ బాబు అలాంటి ఓ చెరగని పేరుని మంచు ఫ్యామిలీకి తీసుకొచ్చారు. నటుడిగా నిర్మాతగా తనదైన స్టైల్లో నటించి ,సినిమాలను నిర్మించి ఆకట్టుకున్న మోహన్ బాబు.. తన వారసత్వాన్ని అందిపుచ్చుకొని కొడుకులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. కాగా మంచు మోహన్ బాబు పెద్దకొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు “విష్ణు” అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకుని ..ఏకంగా ఫిలింఫేర్ ఉత్తమ తొలిచిత్ర నటుడిగా అవార్డు అందుకున్నాడు .

అయితే అంతకుముందే “రగిలే గుండెలు” అనే సినిమాలో బాల నటుడుగా జనాలకు పరిచయమయ్యాడు. విష్ణు సినిమా తర్వాత మంచు విష్ణు బోలెడు సినిమాలో నటించాడు సూర్యం .పొలిటికల్ రౌడీ, అస్త్రం ,గేమ్ ,ఢీ, కృష్ణార్జున , సలీం , వస్తాడు నా రాజు, దేనికైనా రెడీ ,దూసుకెళ్తా పాండవులు పాండవులు తుమ్మెద ..ఇలా దాదాపు25సినిమాల్లో నటించాడు. అయితే ఏ సినిమా కూడా ఆయనకి చెప్పుకోదగ్గ హిట్ ఇవ్వలేదు . నిజం చెప్పాలంటే విష్ణు సినిమా ఒక్కటే ఆయన కెరియర్లు బ్లాక్ బస్టర్ మిగతావి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి.

కాగా రీసెంట్గా జిన్నా సినిమాతో మరోసారి తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు. కాగా మంచు విష్ణు ని తన జాన్ జిగిడి ఫ్రెండ్ అయిన టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరో కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని మోహన్ బాబు అ స్టార్ హీరో నిర్ణయించుకున్నారట . అయితే అప్పటికే విష్ణు ..విరానికా రెడ్డిని ప్రేమించి ఉండడం ఆ విషయం ఇంట్లో చెప్పకపోవడంతో.. మోహన్ బాబు వాళ్ళతో సంబంధం కూడా ఖాయం చేసుకున్నారట. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే వీళ్లు త్వరలోనే వియ్యంకులు అవ్వబోతున్నారు అంటూ మీడియాలో కూడా న్యూస్ వైరల్ గా మారింది . అయితే ఎవరు ఊహించిన విధంగా కొన్ని వారాలకి మంచు విష్ణు అఫీషియల్ గా విరానికా రెడ్డితో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు మంచుమోహన్ బాబు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షేక్ అయింది . ఇంత మంచి ఫ్రెండ్స్ ఎందుకు వియ్యంకులు కాలేకపోయారు అనుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని సినిమా ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా అయ్యింది . అయితే కొందరు మంచు ట్రోలర్స్ ఆ ఫ్యామిలీ నీ దారుణంగా ట్రోల్ చేసింది. ” నువ్వు లక్కీ మామ వి.. అందుకే అలాంటి అల్లుడు నీకు రాలేదు ” అంటూ రెచ్చ్కొట్టే వ్యాఖ్యలు చేసారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ పై ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news