Moviesఏమి పీకలేపోయావ్ బ్రో..ఈసారి దొరికింది పీకుతా..నాగ్ కు ఆది రెడ్డి బోల్డ్...

ఏమి పీకలేపోయావ్ బ్రో..ఈసారి దొరికింది పీకుతా..నాగ్ కు ఆది రెడ్డి బోల్డ్ కౌంటర్..!?

భారీ అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్.. రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. సరికొత్త టాస్కులతో రెచ్చగొట్టే మాటలతో బిగ్ బాస్ షోను మలుపు తిప్పుతున్నాడు బిగ్ బాస్. కాగా గతంలో పోలిస్తే రెండు వారాల నుంచి టిఆర్పి రేటింగ్ కూడా బాగా పెరుగుతున్నట్లు సమాచారం . దీనికోసం బిగ్ బాస్.. హౌస్ లోని కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర గొడవలు పెడుతున్నారు . అంతేకాదు కొత్త లవ్ ట్రాక్లు నడుపుతున్నారు. కాగా ఈవారం హౌస్ కి కెప్టెన్ అయ్యేందుకు “ఆఖరి వరకు ఆగని పరుగు” అనే పేరుతో టాస్కులు ఇచ్చారు బిగ్ బాస్.

టాస్క్ లో భాగం ఫైనల్ గా ఆదిరెడ్డి-వాసంతి మధ్య టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది . దీంతో హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ వీళ్లిద్దరిలో ఒకరిని ఇంటి తదుపరి కెప్టెన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నికైన వారే ఇంటికి నెక్స్ట్ కెప్టెన్. ఇక ఆదిరెడ్డి-వాసంతి ఎందుకు కెప్టెన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇంటి సభ్యులకు చెప్పాలి. ఈ క్రమంలోనే ఆదిరెడ్డి మాట్లాడుతూ.. తన నోటి కి పని చెప్పాడు . తన మాట తీరుతో మాయ చేసి ఇంటి కెప్టన్ అవ్వాలని అనుకున్నాడు.

ఆదిరెడ్డి మాట్లాడుతూ..” నేను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాను.. నాగార్జున సార్ కెప్టెన్ గా నేను ఏం పీకలేకపోయాను అన్నారు.. కాబట్టి ఇంకోసారి అవకాశం ఇస్తే పీకుదామని అంటూ కొంచెం ఘాటుగానే చెప్పారు. దీంతో ఆదిరెడ్డి మాటలు విన్న కంటెస్టెంట్స్.. బయట జనాలు.. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి ఆ మాటలు నాగార్జున వెటకారంగా వెక్కిరించినట్టు ఉంది అంటూ చెప్తున్నారు . ఆదిరెడ్డికి సపోర్ట్ చేస్తే మరి కొందరు వాసంతికి ఓట్లు వేశారు. మరి ఈరోజు ఎపిసోడ్లో చూడాలి ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయో. ఏది ఏమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఆది రెడ్డి కూసింత ఎక్కువే చేస్తున్నాడు. అంతే కాదు ఆదిరెడ్డి అంటే పడని వాళ్ళు బయట నుంచి ఆయనను ట్రోల్ చేస్తున్నారు. “నువ్వు ఏం పీకలేకపోయావు బ్రో.. బయట ఉండే నువ్వు ఏం పీకలేదు ..లోపలికి వెళ్లి ఏం పీకుతావు ..ఈసారి దొరికింది పీక్కో..” అంటూ చెత్త కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఆది రెడ్డి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news