Moviesవెంకటేష్ కు ఆ భయం..అందుకే భార్య ను బయటకు తీసుకోరారట..!?

వెంకటేష్ కు ఆ భయం..అందుకే భార్య ను బయటకు తీసుకోరారట..!?

సినీ ఇండస్ట్రీలో పబ్లిసిటీ పిచ్చోలు చాలామంది ఉన్నారు . చిన్న సహాయం చేసిన సరే మేము ఈ సహాయం చేసాం అంటూ డప్పు కొట్టుకొని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకునే హీరోలు హీరోయిన్లు బోలెడు మందిని మనం చూస్తూనే ఉన్నాం . మా సినిమా రిలీజ్ అంటూ పోస్టులు పెట్టడం.. ఆ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ అంటూ ప్రతిదానికి ఏదో ఒక విధంగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తూనే ఉంటారు . తద్వారా వాళ్ల పాపులారిటీని పెంచుకుంటూనే ఉంటారు. అంతేనా తమ సినిమా రిలీజ్ అయితే మొత్తం ఫ్యామిలీని ఏసుకొచ్చే హీరోలు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం

అయితే సినీ ఇండస్ట్రీలో తన ఫ్యామిలీను మీడియాకు దూరంగా పెట్టి పబ్లిసిటీ, పాపులారిటీ నాకు ఏమీ వద్దు అంటూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు హీరో ఒకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు దగ్గుబాటి వారసుడు వెంకటేష్ . ఎస్ వెంకీ గురించి ఎంత చెప్పినా తక్కువే . కాంట్రవర్షియల్ జోలికి వెళ్లడు .. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయరు ..తగాదాలకు వెళ్ళడు. నా పని నేను చూసుకున్నానా ..వెళ్లానా.. ఇంతే అందుకే వెంకటేష్ అంటే సినీ ఇండస్ట్రీ అందరికీ అదొ రకమైన గౌరవం . అంతేకాదు పెళ్లై ఇన్ని సంవత్సరాలు అవుతున్న తన భార్యను ఏ ఫంక్షన్ కి ఏ ఈవెంట్ కి తీసుకురాలేదు.

ఈ విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంది. దానికి కారణం ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం . తన భార్యని, బిడ్డలని ఫ్యామిలీని మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నారట .అంతేకాదు ఈ పబ్లిసిటీ ,పాపులారిటీలు నాకొద్దు.. నా ఫ్యామిలీ నా వరకే ఉండాలి.. భార్యను నలుగురిలో చూపిస్తేనే మన భార్య అవుతుందా..? అంటూ ఇప్పటికీ తన ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటారట. అంతెందుకు తన కూతురు పెళ్లి ఫోటోలు కూడా నీరజ చాలా తక్కువ ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు.. తప్పిస్తే అందరిలాగా హంగామా చేసుకోలేదు వెంకటేష్ . అందుకే నీరజ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఏది ఏమైన వెంకీ తీసుకున్న నిర్ణయం మంచిదే అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news