Moviesస్పెర్మ్ దానం చేస్తున్న టాలీవుడ్ హీరో..శభాష్ అంటున్న సినీ ఇండస్ట్రీ..!!

స్పెర్మ్ దానం చేస్తున్న టాలీవుడ్ హీరో..శభాష్ అంటున్న సినీ ఇండస్ట్రీ..!!

సినిమా ఇండస్ట్రీ చాలా విశాలమైనది. అందుకే ఎంతమంది స్టార్ హీరోలు హీరోయిన్లు ఉన్నా.. కొత్త వాళ్లకి ఇంకా అవకాశాలు ఇస్తుంది . వచ్చిన హీరోలు సక్సెస్ అయ్యారా..? ఫ్లాప్ అయ్యారా..? అన్న సంగతి పక్కన పెడితే . కొత్తగా వచ్చే హీరోల లిస్ట్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. కాగా, ఈ క్రమంలోనే నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో కొడుకు గణేష్ సైతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోయాయి.

టాలీవుడ్ స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ “స్వాతిముత్యం” అనే సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఇప్పటికే దసరా రేసులో చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది గోస్ట్ చిత్రాలు ఉండగా.. ఫస్ట్ టైం తెరంగేట్రం చేస్తూనే బిగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ స్వాతిముత్యం సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధపడటం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.

కాగా “స్వాతిముత్యం” సినిమా ట్రైలర్.. ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది, ఈ సినిమాలో గణేష్ నటన చాలా అద్భుతంగా ఉంది అంటూ జనాలు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఈ చిత్రం కాన్సెప్ట్ టోటల్ గా డిఫరెంట్ అని.. ఇప్పుడు వస్తున్న రొమాంటిక్, యాక్షన్ ధిల్లర్ ఇలాంటివి ఏదీ ఉండదని.. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ చిత్రంలో హీరో స్పెర్మ్ డోనార్ గా కనిపిస్తాడని.. ఈ చిత్రం కాన్సెప్ట్ మొత్తం ఆ కంటెంట్ తోనే తెరకెక్కిందని..డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేసారు అంటూ నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చారు.

తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ..కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ..మరీ ముఖ్యంగా థియేటర్లో ఆడియన్స్ కి ఓ ట్విస్ట్ బాగా నచ్చుతుందని ..ఎలాంటి వల్గారింటికి తావు లేకుండా కుటుంబం మొత్తం కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను తెరకెక్కించామని.. నాగవంశీ చెప్పుకొచ్చారు. దీంతో మొదటి సినిమాతోనే స్పెర్మ్ కంటెంట్ తో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం బెల్లంకొండ గణేష్ కెరియర్ కు బిగ్ ప్లస్ పాయింట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి స్వాతిముత్యం సినిమాతో ఈ స్వాతిముత్యం లాంటి హీరో ఎలాంటి హిట్ అందుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news