Moviesఆ ఉసురే నాగచైతన్య పాలిట శాపంగా మారిందా..? చెత్త పనితో అక్కినేని...

ఆ ఉసురే నాగచైతన్య పాలిట శాపంగా మారిందా..? చెత్త పనితో అక్కినేని పరువు పాయే..!!

పాపం ఏ ముహూర్తాన సమంతాన్ని పెళ్లి చేసుకున్నాడో కానీ ఆ టైం నుంచి అక్కినేని కుర్రాడు నాగచైతన్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉన్నాడు. కొందరేమో హీరోయిన్ మొగుడుగా పాపులర్ అయ్యావంటారు.. కొందరేమో నీ తండ్రి పేరుతో పాపులర్ అయ్యావు అంటారు.. కొందరేమో నువ్వు హీరోగా సెట్ అవ్వవు అంటారు.. ఇలా నాగచైతన్యను ఎక్కువ మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సందర్భాలే ఉన్నాయి. అయితే రీసెంట్గా నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది . దానికి కారణం తదుపరి సినిమా షూటింగ్ ఆగిపోవడమే.

థాంక్యూ, లాల్ సింగ్ చద్దా ఈ రెండు సినిమాలతో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ..ఇప్పుడు ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకుని ఉన్నాడు. మనకు తెలిసిందే నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తో ఓ బైలింగ్వల్‌ చిత్రం చేస్తున్నారు . కాగా ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో గ్రాండ్గా ప్రారంభమైంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేలుకోట సమీపంలో రాజగోపురం దగ్గర మద్యం విక్రయ కేంద్రం సెట్ వేశారు . అయితే పవిత్ర గల ప్రదేశంలో ఇలా మద్యం సెట్ వేయడంపై అక్కడి స్థానికులు చిత్ర బృందంపై ఫైర్ అయ్యారు.

 

అంతేకాదు సెట్ ని ధ్వంశం చేస్తూ అక్కడ ఉన్న సినిమా సిబ్బందిని పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం గ్రామస్తులు తరుముతున్న టైంలో నాగచైతన్య కూడా అక్కడే ఉన్నారని ఆయన కూడా పరుగులు పెట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది. నిజానికి షరతులతో చిత్రీకరణకు అనుమతి ఇవ్వగా చిత్ర యూనిట్ దాన్ని ఉల్లంఘించిందని స్థానిక కన్నడ సంఘాలు ప్రతినిధులు విమర్శించారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .ఏది ఏమైనా సరే సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య టైం అస్సలు బాగాలేదని ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ అవుతుందని జనాలు చెప్పుకొస్తున్నారు. నిజంగా సమంత కన్నీరు ఉసురే నాగచైతన్య పాట శాపంగా మారిందా అన్న డౌట్లు మొదలయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news