Moviesచిరంజీవి పెనుతుఫాన్ VS బాల‌య్య సునామీ యుద్ధం గురించి తెలుసా...!

చిరంజీవి పెనుతుఫాన్ VS బాల‌య్య సునామీ యుద్ధం గురించి తెలుసా…!

టాలీవుడ్‌లో ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ? ఉంటుందో 30 ఏళ్ల‌కు పైగానే చూస్తున్నాం. అలాంటిది ఈ ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకేసారి థియేట‌ర్ల‌లోకి దిగితే బాక్సాఫీస్ దుమ్ము రేగిపోవాల్సిందే. ఇద్ద‌రు హీరోల అభిమానుల వార్ అయితే మామూలుగా ఉండ‌దు. అప్ప‌ట్లో చిరు, బాల‌య్య సినిమాలు.. అందులోనూ ఒకేసారి సంక్రాంతికి వ‌స్తున్నాయంటే ఫ్యాన్స్ మ‌ధ్య పెద్ద యుద్ధాలే జ‌రిగేవి.

1999 సంక్రాంతికి ముందు వర‌కు చిరంజీవి మంచి ఫామ్‌లో ఉన్నాడు. చిరు సినిమాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. ఈ సంక్రాంతికి ముందు చిరు న‌టించిన చూడాల‌ని ఉంది ఇండ‌స్ట్రీ రికార్డ్ కొట్ట‌డంతో పాటు ఆ రోజుల్లో 63 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పాత రికార్డుల‌కు పాత‌రేసింది. చూడాల‌ని ఉంది వ‌చ్చిన 4 నెల‌ల్లోనే సంక్రాంతికి చిరు స్నేహంకోసం సినిమాతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే అదే సంక్రాంతికి ముందు వ‌ర‌కు బాల‌య్య వ‌రుస ప్లాపుల‌తో ఉన్నాడు.

బాల‌య్య సినిమాలు స‌రిగా ఆడ‌లేదు. బాల‌య్య అదే సంక్రాంతికి స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాతో స్నేహంకోసం సినిమాకు పోటీగా వ‌చ్చాడు. మామూలుగా బాల‌య్య సినిమా కంటే స్నేహంకోసం సినిమా మీదే ట్రేడ్ వ‌ర్గాల్లో, అభిమానుల్లో ఎక్కువ అంచ‌నాలు ఉన్నాయి. ముందుగా 1999 జ‌న‌వ‌రి 1న స్నేహంకోసం రిలీజ్ అయ్యింది. సంక్రాంతికి స‌మ‌ర‌సింహారెడ్డి వ‌చ్చింది.

స్నేహంకోసం సినిమా హిట్ అయ్యింది. వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో చిరు డ‌బుల్ రోల్ చేశారు. చిరు న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టుడు అవార్డు కూడా వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత కృష్ణ హీరోగా వ‌చ్చిన మాన‌వుడు దాన‌వుడు అడ్ర‌స్ లేకుండా పోయింది. అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ఇక సుమ‌న్ హీరోగా వ‌చ్చిన పెద్ద‌మ‌నుషులు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక ప్లాప్ అయ్యింది.

అయితే స‌మ‌ర‌సింహారెడ్డి ఏకంగా 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడి స‌రికొత్త ఇండ‌స్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. చిరు చూడాల‌ని ఉంది సినిమా రికార్డుల‌ను తుడిపేయ‌డంతో పాటు ఆ సినిమా దెబ్బ‌తో స్నేహంకోసం పోటీ ఇచ్చినా నిల‌బ‌డ‌లేదు. చిరు ఆ సంక్రాంతికి పెనుతుఫాన్ క్రియేట్ చేస్తే… బాల‌య్య ఏకంగా సునామీతో దులిపేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news