Moviesచిరంజీవి ' ఖైదీ ' , నాగార్జున ' శివ‌ '...

చిరంజీవి ‘ ఖైదీ ‘ , నాగార్జున ‘ శివ‌ ‘ కు ఎన్టీఆర్ ‘ బొబ్బిలిపులి ‘ కి సంబంధం ఏంటి…!

ఎన్టీఆర్ కెరీర్‌లో తిరుగులేని సూప‌ర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ హిట్ సినిమాల్లో వేటిక‌వే చాలా స్పెష‌ల్‌. 30 – 40 ఏళ్లు అవుతున్నా ఎన్టీఆర్ చాలా సినిమాలు ఇప్ప‌ట‌కీ తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో అలా నిలిచిపోయాయి. అలాంటి సినిమాల్లో ద‌ర్శ‌క‌రత్న దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బొబ్బిలిపులి ఒకటి. అస‌లు బొబ్బిలిపులి అన్న టైటిల్ పెట్ట‌డంతోనే ప్రేక్ష‌కుల్లో మాంచి హైప్ వ‌చ్చేసింది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న టాక్ వ‌చ్చేసింది.

ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపంకు తోడు పాట‌ల్లో గొప్ప సాహిత్యంతో పాటు సంగీతం, దాస‌రి టేకింగ్ ఇవ‌న్నీ సినిమాను ఫ‌స్ట్ ఆట్ నుంచే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చేలా చేశాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్‌కు ముందు చాలా అడ్డంకులు వ‌చ్చాయి. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కావ‌డానికి కార‌ణ‌మైన సినిమా కూడా బొబ్బిలిపులే. పైగా ఎన్టీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌గా ఈ సినిమా రిలీజ్ కావ‌డంతో ఎన్టీఆర్ ప్ర‌చారం మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ఈ సినిమా బాగా హెల్ఫ్ అయ్యింది.

స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే అంశాలు పుష్క‌లంగా ఉండ‌డం, మాతృభూమిపై ప్రేమ‌ను పెంచి దేశ‌భ‌క్తిని రగిల్చిన ఈ సినిమాలో ప్ర‌తి పాటా, ప్ర‌తి డైలాగ్‌, ప్ర‌తి సీన్ అప్ప‌టి యూత్‌కు ఓ డ్ర‌గ్‌లాగా ఎక్కేసింది. అన్నింటికి మించి క్లైమాక్స్‌లో 14 నిమిషాల పాటు సాగే కోర్టు సీన్‌లో ఎన్నో విష‌యాల‌ను చ‌ర్చించారు. అయితే ఇప్ప‌ట‌కీ వాటిల్లో చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం లేదు. తెలుగులో ఎన్నో ప‌వ‌ర్ ఫుల్ సినిమాలు, ట్రెండ్ సెట్ట‌ర్ సినిమాలు వ‌చ్చినా కూడా వాటికి ఖ‌చ్చితంగా బొబ్బిలిపులి ఇన్సిప్రేష‌న్ ఉంటుంది.

 

ఆ త‌ర్వాత 1980వ ద‌శ‌కంలో చిరంజీవి ఖైదీ, 1990వ ద‌శ‌కంలో నాగార్జున శివ సినిమాలు వ‌చ్చి ట్రెండ్ సెట్ చేశాయి. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా రూపురేఖ‌లు మార్చేశాయి అన‌డంలో డౌట్ లేదు. అయితే ఈ రెండు సినిమాల మూలాలు బొబ్బిలిపులిలోనే ఉన్నాయ‌ని చాలా మంది విమ‌ర్శ‌కులు చెప్పేవారు. ఈ రెండు సినిమాల‌కు ఇన్సిప్రేష‌న్ బొబ్బిలిపులే అంటారు. ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద‌బిందువుగా మారిన బొబ్బిలిపులి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన చివ‌రి సినిమా.

ఇక బొబ్బిలిపులి సెన్సార్ విష‌యంలో పెద్ద పోరాట‌మే చేయాల్సి వ‌చ్చింది. అయితే గొప్ప సినిమాల‌కు ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయ‌న్న‌ట్టుగా ఈ సినిమాకు ప్రేక్ష‌కులే సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌నుకోవాలి. ఎన్టీఆర్ పోషించిన మేజ‌ర్ చ‌క్ర‌ధ‌ర్ పాత్ర‌ను ఓ ద‌ర్శ‌కుడిగా కాకుండా, ఓ ప్రేక్ష‌కుడిగా, సినీ ప్రేమికుడిగా ద‌గ్గ‌రుండి చూసిన దాస‌రి ఎన్టీఆర్ న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధుడు అయిపోయాడు. ఇది ఖ‌చ్చితంగా ఓ చరిత్ర సృష్టించే సినిమా అవుతుంద‌ని దాస‌రి సినిమా షూటింగ్ టైంలోనే అంచ‌నా వేయ‌డం ఆయ‌న‌లోని స్వ‌చ్ఛ‌మైన ద‌ర్శ‌కుడికి నిద‌ర్శ‌నం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news