Moviesఏవయ్య..రాజమౌళి నీకు బుర్ర ఉందా..? కళ్లు దొబ్బాయా..? ఆ విషయంలో అడ్డంగా...

ఏవయ్య..రాజమౌళి నీకు బుర్ర ఉందా..? కళ్లు దొబ్బాయా..? ఆ విషయంలో అడ్డంగా దొరికిపోయాడురోయ్..!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాబోలు భలే సెట్ అవుతాయి. స్టార్ హీరో హీరోయిన్లకి.. స్టార్ హీరో ప్రొడ్యూసర్లకి ..స్టార్ హీరోయిన్స్ డైరెక్టర్లకి ,,ఇలా కొందరికి రేర్ కాంబో సెట్ అవుతుంటాయి. అలాగా అభిమానులు వెయిట్ చేస్తున్న సూపర్ రేర్ కాంబో మహేష్ బాబు-రాజమౌళి . మనకు తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే స్టార్ హీరోలు అందరూ ఎగబడి పోతారు. అలాంటిది దర్శకధీరుడు రాజమౌళినే మహేష్ బాబు తో సినిమా చేయాలని ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం ..దానికి తగ్గట్టు విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ రాయడం.. ఆ స్క్రిప్ట్ విన్న మహేష్ బాబు ఒకే చేయడం.. అన్ని ఆశ్చర్యకరంగా అయిపోయాయి.

ప్రజెంట్ మహేశ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆరు నెలల్లో పూర్తిచేసి జనవరి ఆఖరి కల్లా సినిమాలు కంప్లీట్ చేసేసి రాజమౌళి సినిమాను తెరపైకి తీసుకురావాలనేదే మహేష్ బాబు ప్రయత్నం . అందుకు అనుగుణంగానే మహేష్ బాబు షెడ్యూల్స్ పెట్టుకుంటున్నాడు. అయితే రాజమౌళి కూడా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ..మహేష్ బాబు కెరియర్ లోనే ఎప్పుడూ లేనంత విధంగా ఈ సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ ను పెట్టబోతున్నామంటూ ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పుకు రావడం సినిమాకి మంచి హైప్ ఇచ్చింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది.


మహేష్ బాబుకి జోడిగా ఈ సినిమాలో రాజమౌళి బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించుతున్నాడట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను తెలుగు జనాలకు పరిచయం చేసిన రాజమౌళి ..ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనేను మహేష్ బాబు కి జోడిగా ఎస్ ఎస్ ఎన్ బి 29 సినిమాకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు.

మహేష్ బాబు లాంటి హ్యాండ్ సమ్ హీరో పక్కన అలాంటి ఫిగర్ బాగోదు అంటున్నారు. మనకు తెలిసిందే దీపికా పదుకొనే నటించడానికి బాగున్న చూడడానికి పెద్ద ఫిగర్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మరి అలాంటిది మన మహేష్ బాబు పక్కన అలాంటి అమ్మాయిని హీరోయిన్గా ఊహించుకోవడం మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరింత కంపరంగా ఉందట. ఇదే విషయాన్ని రాజమౌళికి చెప్తూ..” నీకు బుర్ర లేదా ..మహేష్ బాబు రేంజ్ ఎక్కడ.. ఆ స్థాయి హీరోయిన్ ని తీసుకురా ..”అంటూ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు .దీంతో మహేష్ బాబు, దీపికా పదుకొనే ,రాజమౌళి ,ఎస్ ఎస్ ఎన్ బి 29 హాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి మరి చూడాలి రాజమౌళి ఆలోచన మార్చుకుంటాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news