Moviesకొడుకు కోసం స్టార్ హీరోయిన్ కూతురు ని సెలక్ట్ చేసిన నాగార్జున...

కొడుకు కోసం స్టార్ హీరోయిన్ కూతురు ని సెలక్ట్ చేసిన నాగార్జున ..ఫిగర్ బాగుందే..!?

అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు . పేరుకు సీనియర్ హీరోనే అయినా యంగ్ హీరోలకి ధీటుగా సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోల కన్నా అందంగా టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ మన్మధుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగార్జున . ఇప్పటికీ ఈయన కొడుకులని ఈయనని పక్కన పెడితే ఈనే అందంగా ఉంటాడు . ఇదే విషయం అమ్మాయిలు కూడా చెప్తారు ..అంత హ్యాండ్ సమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగార్జున.

కాగా ఈయన వారసత్వాన్ని అందిపుచ్చుకోని ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని నాగచైతన్య ,అక్కినేని అఖిల్ ఇంకా ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ కాలేకపోతున్నారు. నాగచైతన్య ఈ మధ్యనే రిలీజ్ అయిన థాంక్యూ సినిమాతో మరో భారీడిజాస్టర్ ను తనకు ఖాతాలో వేసుకున్నాడు అంతకుముందు వచ్చిన బంగారాజు సినిమాతో పర్లేదు అనిపించిన ..రీసెంట్ గా వచ్చిన థాంక్యూ తో మాత్రం నాగచైతన్య అస్సలు నటన పనికిరాడు అన్న కామెంట్ లే వినిపించాయి. ఈ క్రమంలోనే తన తదుపరి ప్రాజెక్టు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు నాగార్జున.

మనకు తెలిసిందే డైనమిక్ డైరెక్టర్ పరుశురాం డైరెక్షన్లో నాగచైతన్య ఓ సినిమా కమిట్ అయ్యాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా మహేష్ బాబుతో సర్కారు వారి పాట కన్నా ముందే తెరకెక్కాల్సింది. కానీ నాగచైతన్య బిజీ షెడ్యూల్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఖాళీ టైం దొరికిన అప్పటికే పరశూరాం మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీ కమిట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు మరింత లేట్ అయింది . కాగా రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య ఈ ప్రాజెక్టుని త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట .

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దానికి ముఖ్య కారణం ఈ సినిమాలో నాగచైతన్య రొమాన్స్ చేయబోది ఒకప్పటి సీనియర్ హీరోయిన్ డాటర్. అంతేకాదు అమ్మడుని సజెస్ట్ చేసింది హీరో అక్కినేని నాగార్జున. సీనియర్ హీరోయిన్ మాలశ్రీ అందరికి గుర్తుండే ఉంటుంది. తనదైన నటనతో మెప్పించి కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంది. అయితే తన కూతురు రాధానా రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే కన్నడ హీరో దర్శన్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ . ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో స్టార్ హీరో సినిమాలో ఆఫర్ అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి నాగచైతన్య ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news