Moviesతండ్రికే డబ్బు అప్పుగా ఇస్తున్న హీరోయిన్..పక్కా కామర్షీయల్..!!

తండ్రికే డబ్బు అప్పుగా ఇస్తున్న హీరోయిన్..పక్కా కామర్షీయల్..!!

ఓ పెద్దాయన చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. “డబ్బులు ఊరికే రావు” . ఈ విషయం నిజమే కానీ, ఈ డైలాగ్ ను ఓ హీరోయిన్ బాగా పట్టేసింది. ఎంతలా అంటే సొంత తండ్రికే డబ్బులు అప్పుగా ఇచ్చేంతలా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న..నమ్మలేకపోయినా..ఇది నిజమే అంటున్నారు సినీ ప్రముఖులు. ఆడపిల్ల కి డబ్బు విలువ తెలియదు అంటారు అందరు. కానీ ఈ అమ్మడుకి కూసింత ఎక్కువే దాచిపెట్టడం తెలుసు అనుకుంటా అందుకే ఇలా చేస్తుంది..అంటున్నారు జనాలు.

పేరుకు పక్క బాషా ఇండస్ట్రీ నుండే వచ్చిన..తెలుగులో మంచి మంచి హిట్ సినిమాల్లో నటించి..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లి పోయింది. కోలీవుడ్ లోను సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ..మిగత సీనియర్ ముద్దుగుమ్మలకు షాక్ ఇస్తుంది. అయితే, ఈ అమ్మడు సంపాదించిందంతా వాళ్ల అమ్మ చేతికే ఇస్తుందట. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదట . చాలా పొదుపుగా బట్టలు వాడే ఈ హీరోయిన్ షాపింగ్ కూడా తక్కువుగానే చేస్తుందట.

అయితే, అమ్మ కోసం మాత్రం ఎంత ఖర్చు చేసి అయినా..ఆమెకు కావాల్సింది అడకుండానే కొన్ని ఇస్తుందట ఈ బ్యూటి. కానీ, తండ్రి దగ్గరకు వచ్చే సరికి..ఆ ప్రేమ ఏం ఉండదు. ఎందుకంటే మొదటి నుండి ఆమెకు తండ్రీ అంటే చిరాకు అట. తాగుడు అలవాటుతో..అమ్మని వేధిస్తాడని..కుటుంబ పెద్ద దిక్కుగా ఉండి కూడా అమ్మ కష్టపడి తెచ్చిన డబ్బులను కూడా తాగుడికే ఖర్చు చేసేవారట . అవన్ని చూసి పెరిగిన ఈ హీరోయిన్ పాప..తండ్రికి ఒక్క రూపాయి ఇచ్చిన మళ్ళీ తిరిగి తీసుకుంటుందట. దీంతో అమ్మడు ని అంతా పక్క కమర్షీయల్ అంటూ పిలుస్తున్నారు. తాగుడు అలవాటు తప్పే కానీ..ఇలా జన్మనిచ్చిన తండ్రికే డబ్బులు అప్పుగా ఇవ్వడం కరెక్ట్ నేనా…???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news