Movies' బింబిసార ' ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది... క‌ళ్యాణ్‌కు అదిరిపోయే కం...

‘ బింబిసార ‘ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది… క‌ళ్యాణ్‌కు అదిరిపోయే కం బ్యాక్

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తాజా సినిమా బింబిసార‌. టైం ట్రావెల్ స్టోరీతో తెర‌కెక్కిన ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ వైబ్స్ బాగున్నాయి. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట్ ఈ టైమ్ ట్రావెల్ స్టోరీని తెర‌కెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ రు. 37 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. గ‌తంలో క‌ళ్యాణ్ ఏ సినిమాకు జ‌ర‌గ‌నట్టుగా బింబిసార‌కు ప్ర‌మోష‌న్లు హోరెత్తిస్తున్నారు.

కేథ‌రిన్ థెస్రా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే వ‌రీనా హుస్సేన్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమాలో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ న‌టిస్తున్నారు. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు హిట్ అవ్వ‌డంతో పాటు క‌థాంశం కొత్త‌గా ఉండ‌డం, ఎప్పుడో కీస్త్రు శ‌కం 5వ శ‌తాబ్దం నాటి మ‌గ‌ధ రాజు బింబిసారుడి క‌థాంశంతో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఎక్స్‌పెక్టేష‌న్స్ అయితే మామూలుగా లేవు.

ఇక ఈ సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే బింబిసార రివ్యూ వ‌చ్చేసింది. క‌ళ్యాణ్‌రామ్ సినిమాల‌కు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా బింబిసార‌కు పాజిటివ్ టాక్ బాగా వ‌చ్చింది. ప్ర‌ముఖ సెన్సార్ బోర్డు స‌భ్యుడు ఉమైర్ సంధు బింబిసార ఫ‌స్ట్ రివ్యూ త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌య‌ట‌కు వ‌దిలారు. సినిమా చాలా బాగుంద‌ని.. హీరో క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు టాలీవుడ్‌కు ఇది అదిరిపోయే క‌మ్‌బ్యాక్ అవుతుందంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

ఇక ఈ సినిమా క‌థ ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 టైంలో న‌డుస్తుండ‌డంతో చాలా భాగం గ్రాఫిక్స్‌తో న‌డిచే సీన్లు ఉంటాయ‌ట‌. సినిమా అయితే ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేసేలా ఉంటుంద‌ని అంటున్నారు. గ‌తంలో బాల‌య్య నటించిన ఆదిత్య 369 టైమ్ ట్రావెల్ కథాంశంతోనే వచ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఇప్పుడు అబ్బాయ్ క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న ఈ టైమ్ ట్రావెల్ స్టోరీ ఎలా ఉంటుందో మ‌రి కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news