Moviesబాల‌య్య‌పై సీనియ‌ర్ హీరోయిన్ ఇంద్ర‌జ కామెంట్లు మామూలుగా లేవుగా...!

బాల‌య్య‌పై సీనియ‌ర్ హీరోయిన్ ఇంద్ర‌జ కామెంట్లు మామూలుగా లేవుగా…!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్లు అందరూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అత్త, అమ్మ, వదిన పాత్రలతో సక్సెస్ ఫుల్ అవుతున్నారు. రమ్యకృష్ణ – నదియా -మీనా – ఆమని ఇలా పలువురు హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే 1990వ దశకంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. ఇంద్రజ నట‌సింహం బాలకృష్ణతో పెద్దన్నయ్య – లయన్ సినిమాలలో కలిసి నటించారు.

ఆమె తన తాజా ఇంటర్వ్యూలో బాలయ్య గురించి మాట్లాడుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని… ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తారని ఇంద్రజ తెలిపారు. ఇదే విషయం ఎవరిని అడిగినా చెబుతారు అని కూడా ఇంద్రజ కామెంట్ చేశారు. బాలయ్యకు మనసులో ఒక మాట… నాలుక‌పై మరో మాట ఉండదని ఆమె తెలిపారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అద్భుతం అని… ఆయ‌న‌ చాలా మంచి వ్యక్తి అని బాలయ్యను ఆకాశానికి ఎత్తేశారు.

ఇక దివంగత నటి సౌందర్య తాను కలిసి 3 – 4 సినిమాలు చేశామని.. మేకప్ లేకపోతేనే సౌందర్య చాలా అందంగా ఉంటుందని ఇంద్రజ వెల్లడించారు. సౌందర్య ఎంతో సింపుల్‌గా ఉంటుందని… ఇక తనకు ఓ అగ్ర హీరో రికమెండ్‌ చేయడం వల్లే ఆఫర్లు వ‌చ్చాయంటూ జరిగిన ప్రచారం కూడా అబద్ధం అంటూ ఆమె ఖండించారు. డైరెక్టర్ చెప్పిన హీరోయిన్ తో పోల్చి చూస్తే… హీరో చెప్పిన హీరోయిన్ కొన్నిసార్లు బాగుండొచ్చు కదా ? అన్న అభిప్రాయం కూడా ఆమె వ్యక్తం చేశారు.

ఇక తన కెరీర్లో అమ్మదొంగ అతి ముఖ్యమైన సినిమా అని… కృష్ణ గారు ఏమి పట్టించుకోరని ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఒక్కసారి డైలాగ్ చెప్తే చాలు కృష్ణ గారు వెంటనే చెప్పేస్తారని… ఇప్పటి తరం హీరోయిన్లు చాలా ఇండిపెండెంట్గా ఆలోచిస్తూ తమ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారని ఇంద్రజ వెల్లడించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news