Moviesఇష్టం లేకుండానే నాగార్జునతో ఆ పని చేశా..బయటకి చెప్పితే లేనిపోని గొడవలు..ఇంద్రజ...

ఇష్టం లేకుండానే నాగార్జునతో ఆ పని చేశా..బయటకి చెప్పితే లేనిపోని గొడవలు..ఇంద్రజ బిగ్ బాంబ్..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అన్నా కానీ, వచ్చిన తరువాత..ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి అన్నా కానీ.. ఆచి తూచి అడుగులు వేయాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా..అంతే సంగతులు. కెరీర్ లో ముందు కు వెళ్ల లేరు. ఇదే విషయాని మరోసారి ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది..ఒకప్పటి హాట్ ఐటెం బాంబ్..ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. “నీ జీను ఫ్యాంటు చూసి బుల్లెమో”..ఈ పాట లో ఆమె పర్ ఫామెన్సులు ఎన్నేళ్లు అయినా మర్చిపోగలమా..?

ఆ అందం..ఆ రూపం..ఆ నవ్వు..ఆ రెస్పెక్ట్..అబ్బో వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్ల కు మించిపోయే అందం ఉన్నా కానీ ఇంద్రజ కి కొన్నీ ఆఫర్స్ చేతికి వచ్చిన్నట్లే వచ్చి చేజారిపోయాయి. దానికి కారణం ఆ టైంలో ఆమె వేసిన కొన్ని తప్పటి అడుగులే. కెరీర్ పీక్స్ లో ఉండగానే..ఐటెం సాంగ్స్ చేసి..ఫాం తగ్గించుకునేసింది. హీరోయిన్ గా ఎదుగుతున్న తన కెరీర్ కి బ్రేకులు వేసుకుంది.

ఆ రోజుల్లోనే ఇంద్రజ రెండు ఐటెం సాంగ్స్ చేసింది. నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అలరించింది. అలాగే ఓ తమిళ సినిమా లో కూడా ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. తాజా ఇంటర్వ్యూలో వాటి గురించేఅడగగా.. ఇంద్రజ మాట్లాడుతూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. “నిజానికి అలాంటి సాంగ్స్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు. పెద్ద వాళ్ల రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్‌ అడిగినప్పుడు మనం నో చెప్పితే.. బాగుండదు. పెద్ద బ్యానర్ కదా అనే చాలా మంది ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను.

అయినా, ఇప్పుడు వాటి గురించి ఎందుకులేండి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువగా మాట్లాడను..” అని చెప్పుకొచ్చింది. అంటే ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లు కూడా బలవంతంగా హీరోయిన్స్ ని ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పకనే చెప్పేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news