Moviesవావ్: అభిమానులకు మహేశ్ బాబు కని విని ఎరుగని బిగ్ సర్...

వావ్: అభిమానులకు మహేశ్ బాబు కని విని ఎరుగని బిగ్ సర్ ప్రైజ్.. !!

యస్ ఇప్పుడు ఇదే న్యూస్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు ఊహించలేదు ఇలాంటి సర్ప్రైజ్ మహేష్ బాబు నుండి వస్తుంది అని .ఈసారి తన పుట్టినరోజుకి ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా అభిమానులను నిరాశపరిచిన మహేష్ బాబు ..ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన సర్ప్రైజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మనకు తెలిసిందే మహేష్ బాబు చాలా సైలెంట్. తన పని తాను చేసుకోపోయే హీరో. కాంట్రవర్షియల్ జోలికి అస్సలు వెళ్ళడు. తన జోలికి వస్తే అస్సలు వదలడు.


సినిమా ప్రమోషన్స్ లో తప్పిస్తే బయట పెద్దగా కనబడిన మహేష్ బాబు.. రీసెంట్ గా బుల్లితెర షో కి గెస్ట్ గా హాజరయ్యారు . ఇది నిజంగా బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే తన ఇన్నాళ్ళ కెరీర్లో మహేష్ బాబు బుల్లితెరపై మెరిసింది చాలా తక్కువ. మిగతా హీరోలైనా సరే అడపా దడపా.. కనిపిస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు మాత్రం చాలా చాలా రేర్ గా బుల్లి తెర పై కనిపిస్తారు. దీంతో ఇప్పుడు మహేష్ బాబు బుల్లితెర షో కి వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ షోకి మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ..మహేష్ తో పాటు ఆయన ముద్దుల కూతురు సితార కూడా ఈ షోలో కనిపించబోతుంది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ తన కూతురితో కలిసి సెట్స్ పైకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అంతే సెకండ్స్ లో వీళ్ళ ఫొటోస్ వీడియోస్ వైరల్ గా మారిపోయాయి. ఇందులో మహేష్ తన కూతురు చేయి పట్టుకొని నడుస్తూ కనిపిస్తున్నారు. మరో విషయం ఏంటంటే మహేష్ ఆ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. సితార పాప కూడా అదిరిపోయే ఫ్రాక్ వేసుకొని ట్రెండింగ్ స్టైలిష్ గా రెడీ అయింది. మరి షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news