Moviesబిగ్ షాకింగ్ ట్వీస్ట్ : అనసూయ ని జబర్ధస్త్ మానేయమని చెప్పింది...

బిగ్ షాకింగ్ ట్వీస్ట్ : అనసూయ ని జబర్ధస్త్ మానేయమని చెప్పింది ఆ స్టార్ డైరెక్టర్ నా ..?

జబర్ధస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన షో. ఇప్పుడు మేం స్టార్ కమెడీయన్స్ అని చెప్పుకుని..పెద్ద బంగ్లాలు..కార్లలో తిరుగుతున్న స్టార్స్ ఈ షో ద్వారానే పాపులర్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే పునర్జన్మ నిచ్చింది ఈ షో వాళ్లకి అనే చెప్పాలి. మరి అలాంటి అన్నం పెట్టిన షో ని విడిచి పోతున్నారు చాలా మంది కామెడియన్స్. దానికి కారణాలు ఏవైన కావచ్చు…వెళ్లిపోయినా పర్లేదు కానీ..కొందరు కామెడియన్స్ నిందలు కూడా వేసారు. దాంతో ఈ రచ్చ సోషల్ మీడియాకి ఎక్కింది.

ఆ తరువాత షో మేనేజర్ ఏడుకొండలు కూడా తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చారు. కొందరు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ షో కి వస్తే..కొందరు బెట్టు చేస్తూ ఆఫర్ ని హోల్డ్ పెట్టి ఉన్నారు. కానీ, స్టార్ యాంకర్ అనసూయ మాత్రం..షో నుండి తప్పుకుంది. గత కొన్ని రోజుల నుండి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నా..ఇప్పుడు అఫిషీయల్ గా అనసూయ జబర్ధస్త్ షో నుండి తప్పుకునేసింది. ఇప్పుడు అనసూయా..మాజీ జబర్ధస్త్ యాంకర్ అయిపోయింది. షో మొదలు పెట్టినప్పటి నుండి యాంకర్ గా వస్తున్న ఈ బ్యూటీ సడెన్ గా ఇలా షో మానేయడం పై చాలా వార్తలు వైరల్ అయ్యాయి.

కొందరు ఏమో సినిమా అవకాశాలు వస్తున్నాయని..కొందరు ఏమో వేరే ఛానెల్ లోకి వెళ్తుందని..చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..జబర్ధస్త్ షో నుండి ఆమెను తప్పుకోమని చెప్పింది ..అనసూయ గురూజి..టాలీవుడ్ పెద్ద మనిషి అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారైంది. అనసూయ కి సినిమా అవకాశాలు వస్తున్నాయి..

ఇలాంటి టైంలో నువ్వు ఇంకా బుల్లితెర లో నే ఉండటం..నీ కెరీర్ కి మైనస్ అవుతుంది..బిగ్ ఆఫర్స్ రావు..షో నుండి తప్పుకుంటే..నువ్వు వెండితెర బ్యూటీ అవుతావు..కావాల్సినంత డబ్బు..పేరు..ఆలోచించుకో..”అంటూ అమ్మడుని కన్ ఫుజ్ చేసి..ఎట్టకేలకు అమ్మడు మనసును మార్చేసారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదిఏమైన స్టేట్ పాలిటిక్స్ ని మించిపోయే రేంజ్ లో ఉన్నాయి జబర్ధస్త్ పాలి “ట్రిక్స్”..!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news