Moviesఆ హీరో ప్రేమ‌కు విల‌న్‌గా స‌మంత‌... వామ్మో కొత్త అవ‌తారం ఎత్తిందిగా...!

ఆ హీరో ప్రేమ‌కు విల‌న్‌గా స‌మంత‌… వామ్మో కొత్త అవ‌తారం ఎత్తిందిగా…!

టాలీవుడ్ స్విటీబ్యూటీ స‌మంత విడాకుల త‌ర్వాత ఎక్కడా త‌గ్గేదేలే అన్న‌ట్టుగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం స‌మంత చేతిలో తెలుగు సినిమాలే మూడు ఉన్నాయి. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె న‌టిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ శాకుంత‌లం ఉంది. ఇక య‌శోద అనే మ‌రో థ్రిల్ల‌ర్ సినిమాలోనూ సామ్ క‌నిపిస్తోంది. ఇక టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమా వ‌స్తోంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఖుషీ సినిమా టైటిల్‌నే ఈ క్రేజీ కాంబోలో వ‌స్తోన్న టైటిల్‌కు వాడుకుంటున్నారు. రిలీజ్ అయిన స్టిల్స్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ఆస‌క్తిగానే క‌నిపిస్తోంది. అటు బాలీవుడ్‌లో హాట్ వెబ్ సీరిస్‌లు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స‌మంత పాత్ర గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాలో స‌మంత నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ట‌. విజ‌య్ ప్రేమ‌కు ముందు నుంచి విల‌న్‌గా ఉండే ఈ క్యారెక్ట‌ర్ చివ‌ర్లో ఎమోష‌న‌ల్‌గా ఎలా ట‌ర్న్ అవుతుంద‌న్న క‌థాంశంతో ఈ సినిమా క‌థ ఉంటుంద‌ని అంటున్నారు. సినిమాలో స‌మంత పాత్రే కీల‌కం అని… ఈ సినిమా క‌థ ఓ మెచ్యూర్డ్ ల‌వ్ స్టోరీ అని చెపుతున్నారు.

శివ నిర్వాణ సినిమాలు అంటేనే చాలా హుందాగా ఉంటాయి. ప్రేమ‌క‌థ‌ల‌కు ఆయ‌న కేరాఫ్ అడ్ర‌స్‌. శివ గ‌త సినిమాలు మ‌జిలీ, నిన్ను కోరి కూడా హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉంటాయి. సున్నిత‌మైన మ‌న‌స్సులు ఉండేలా ఆయ‌న పాత్ర‌లు క్రియేట్ చేసుకుంటాడు. ఆ త‌ర‌హాలోనే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కోసం క‌థ రాసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి నెగ‌టివ్ షేడ్స్ పాత్ర‌లో స‌మంత ఎలా ర‌క్తిక‌ట్టిస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news