Moviesఇద్ద‌రు స్టార్ హీరోల చేతిలో న‌లిగిపోయిన హ‌న్సిక‌.. అలా వాడుకున్నారా...!

ఇద్ద‌రు స్టార్ హీరోల చేతిలో న‌లిగిపోయిన హ‌న్సిక‌.. అలా వాడుకున్నారా…!

దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ హన్షిక మొత్వానీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్ దేశ ముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా ఇక్కడ స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన హన్షిక ఆ తర్వాత తమిళం నుంచి అవకాశాలు దక్కడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టి అక్కడ కూడా సూపర్ హిట్స్ అందుకుంది. ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూనే హిందీలో హీరోయిన్‌గా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియ హీరోగా నటించిన ఆప్ కా సురూర్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఇలా బాలీవుడ్‌తో పాటు సౌత్ భాషలలో కూడా నటించిన హన్షిక ఆ తర్వాత కాస్త బొద్దుగా మారడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

అదే సమయంలో తమిళ హీరో శింబుతో హన్షిక ప్రేమలో పడిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి తమిళ సినిమాలలో నటించారు.. హిట్స్ అందుకున్నారు. శింబుతో హన్సిక ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు ఆమె షూటింగ్ నేప‌థ్యంలో విదేశాల్లో ఉన్నా కూడా శింబు అక్క‌డే వాలిపోయేవాడు.
ఈ బొద్దుగుమ్మకి తమిళ తంబీలు గుడి కూడా కట్టారు. అయితే, శింబుని పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. ఏమైందో గాని శింబు – హ‌న్సిక విడిపోయారు.

ఆ త‌ర్వాత హ‌న్సిక‌కు బాలీవుడ్‌లో హిమేష్ రేష్మియాతో ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. అటు హిమేష్..ఇటు శింబు లతో లవ్ లో ఉందని హన్షిక అని వార్తలు వచ్చాయి. అప్పటికే నయనతారతో లవ్ బ్రేకప్ కారణంగా శింబు హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత హన్షిక ని వాడుకున్నాడని చెప్పుకున్నారు. ఇది ఎంతవరకూ నిజమో గానీ ఈ విషయంలో హన్షిక మాత్రం బ్యాడ్ అయిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news