Moviesఒక‌ప్ప‌టీ హాట్ హీరోయిన్ ' వాణీ విశ్వ‌నాథ్ ' సెక్స్ అపీల్స్...

ఒక‌ప్ప‌టీ హాట్ హీరోయిన్ ‘ వాణీ విశ్వ‌నాథ్ ‘ సెక్స్ అపీల్స్ వెన‌క ఉన్న వ్య‌క్తి ఎవ‌రంటే..!

వాణీ విశ్వ‌నాథ్‌..సెక్సీ క్వీన్ అని పేరుతెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ. కుటుంబ నేపథ్యం మలయాళం అయినా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలాంటి హీరోయిన్ దర్శకేందుద్రుడు చేతిలో పడితే తెరపై ఎంత అద్భుతంగా చూపిస్తారో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. అదే వాణీ విశ్వ‌నాథ్‌ కెరీర్ పీక్స్ కి చేరుకోవడానికి ముఖ్య కారణం. వాణీ విశ్వ‌నాథ్‌ తండ్రి జోతిష్యం చెబుతుండేవారు. అలా ఆయన దగ్గరకి సినిమా వాళ్ళు వస్తుండేవారు. అలా వచ్చిన వారిలో ఒకరు వాణీ విశ్వ‌నాథ్‌ ని చూసి ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంపిక చేసుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె చేసిన పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 14 ఏళ్ళ వయసులోనే హీరోయిన్‌గా సింహస్వప్నం సినిమాలో అవకాశం వచ్చింది. జగపతి బాబు హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయినా వాణీ విశ్వ‌నాథ్‌ కి అదే సినిమాతో టాలీవుడ్‌లో కలిసి వచ్చింది. ఇందులో వాణీ విశ్వ‌నాథ్‌ ని చూసిన దర్శకేంద్రుడు తాను తెరకెక్కించిన ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. వాణీ విశ్వ‌నాథ్‌ లోని ఉన్న ప్లస్ పాయింట్స్‌ణు దర్శకేంద్రుడు తన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకున్నారు.

సీన్స్‌లో సాంగ్స్‌లో వాణీ విశ్వ‌నాథ్‌ ని ఎంత గ్లామర్‌గా ఎంత సెక్సీగా చూపించాలో అలా చూపించారు. ముఖ్యంగా వాణీ విశ్వ‌నాథ్‌ నవ్వు చాలా బావుంటుంది. అలాగే, తన ఫిజిక్. నాజుకు నడుముతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఉన్న వాణీ విశ్వ‌నాథ్‌ వాన పాటల్లో అద్భుతంగా కనిపిస్తుంది. వాణీ విశ్వ‌నాథ్‌ లో సెక్స్ అపీల్స్ అంటే తన నవ్వు.. మత్తెక్కించే తన కళ్ళు, పెదవులు. వీటిమీదే ఎక్కువగా ఫోకస్ పెట్టిన దర్శకేంద్రుడు ఘరానా మొగుడు సినిమాలో కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పాటను వానలో తీశాడు.

ఈ ఒక్క పాట వాణీ విశ్వ‌నాథ్‌ కి గ్లామర్ బ్యూటీగా ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఇలాంటి వాన పాటల్లో నటించడం తనకి చాలా ఇష్టమని స్వయంగా వాణీ విశ్వ‌నాథ్‌ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రకంగా వాణీ విశ్వ‌నాథ్‌కు సెక్సీ హీరోయిన్, గ్లామర్ క్వీన్ అనే పదాలు అభిమానులు తగిలించారంటే దానికి కారణం రాఘవేంద్ర రావే అని చెప్పక తప్పదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news