Moviesరాజేంద్ర‌ప్రసాద్ టార్చ‌ర్‌తో టాలీవుడ్ వదిలి పారిపోయిన హీరోయిన్ మాళవిక.. అస‌లేం జ‌రిగింది..!

రాజేంద్ర‌ప్రసాద్ టార్చ‌ర్‌తో టాలీవుడ్ వదిలి పారిపోయిన హీరోయిన్ మాళవిక.. అస‌లేం జ‌రిగింది..!

సినిమా ఇండ‌స్ట్రీలో రాజేంద్ర ప్ర‌సాద్ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా… క‌మెడియ‌న్‌గా, సెంటిమెంట్ రోల్స్ లోనూ న‌టించి అభిమానుల‌ను సంపాదించికున్నారు. అంతే కాకుండా ద‌ర్శ‌కుడిగా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కూడా రాజేంద్ర ప్ర‌సాద్ చేయ‌డం గొప్ప‌విష‌యం. ఎన్టీ రామారావును ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన రాజేంద్ర ప్ర‌సాద్ కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్ర‌లు చేసి మెప్పించారు. ఆ త‌ర‌వాత హీరోగా అవ‌కాశాలు అచ్చాయి.

రాజేంద్ర‌ప్ర‌సాద్ అంటేనే కామెడీకి కేరాఫ్‌. త‌న‌దైన కామెడీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను గిలిగింత‌లు పెట్టేసేవాడు. ప్రేమించు పెళ్లాడు సినిమాతో రాజేంద్ర ప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్ప‌టి వ‌ర‌కూ క‌మెడియ‌న్ లు..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు మాత్రమే న‌వ్వించేవారు. కానీ ఈ సినిమాతో రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోలు కూడా న‌వ్వించ‌వ‌చ్చ‌ని కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. జంధ్యాల‌, బాపు, ఈవీవీ లాంటి టాప్ ద‌ర్శ‌కుల డైరెక్ష‌న్ లో రాజేంద్ర‌ప్రసాద్ సినిమాలు చేశాడు.

టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న‌ రాజేంద్ర ప్ర‌సాద్ కెరీర్లో పెద్ద కాంట్ర‌వ‌ర్సీలు లేవు. అయితే చివ‌ర్లో మాత్రం ఆయ‌న‌పై ఓ మాయ‌ని మ‌చ్చ కూడా ఉంది. ఓ హీరోయిన్ త‌న‌ను రాజేంద్ర ప్ర‌సాద్ వేధించాడు అంటూ ఆరోప‌ణ‌లు చేసింది. రాజేంద్ర ప్ర‌సాద్ అప్ప‌రావు డ్రైవింగ్ స్కూల్ అనే సినిమాలో హీరోగా న‌టించారు. ఈ సినిమాలో మాళ‌విక హీరోయిన్ గా న‌టించింది. కాగా మాళ‌విక‌నే రాజేంద్ర ప్రసాద్ పై ఆ ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాజేంద్ర ప్ర‌సాద్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది. సీన్ల‌లో భాగంగా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌న‌ను అస‌భ్యంగా తాకాడ‌ని చెప్పుకొచ్చింది. న‌టించ‌కుండా త‌న‌ను నిజంగానే తాకాడ‌ని చెప్పింది. అవ‌స‌రం లేకున్నా కూడా కౌగిలించుకోవ‌డం లాంటివి చేశాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.తాను దూరంగా ఉన్న‌ప్ప‌టికీ అర్థం చేసుకోకుండా ఓ రోజు సినిమాలో ముద్దు పెట్టుకునే సీన్ లో నిజంగానే లిప్ లాక్ ఇచ్చాడ‌ట‌.

ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న మాళ‌విక పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని రాజేంద్ర ప్ర‌సాద్ ను, యూనిట్ స‌భ్యుల‌ను బెదిరించింద‌ట‌. దాంతో సినిమాకు న‌ష్టం వస్తుంద‌ని నిర్మాత‌ల మండ‌లి క‌ల‌గ జేసుకుని మాళ‌విక‌ను బుజ్జ‌గించారు. ఆ త‌ర‌వాత కొన్ని కండిష‌న్ల‌తో కేవ‌లం నాలుగు రోజులు మాత్రమే మాళ‌విక డేట్స్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ఇక ఈ సినిమా త‌ర‌వాత మాళ‌విక మ‌ళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేయ‌నేలేదు. త‌ర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూర‌మైనా కూడా రాజేంద్ర ప్ర‌సాద్ ఇష్యూపై ప‌రోక్షంగా
ఆరోప‌ణ‌లు చేస్తూనే వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news